ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఎంఐ 10, ఎంఐ 10 ప్రోలను ఫిబ్రవరి 13న చైనాలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఎంఐ 10 సిరీస్ ఈవెంట్‌ను ఆన్లైన్లో మాత్రమే హోస్ట్ చేయాలని షియోమీ నిర్ణయించింది.
షియోమీ ప్రపంచంలోనే మొదటిసారిగా 108 ఎంపీ పెంటా కెమెరాను తీసుకొస్తోంది. ఎంఐ10, ఎంఐ 10 ప్రోల్లోని పంచ్ హోల్ కట్అవుట్ లోపల ఈ కెమెరా ఉంటుంది. అయితే దీనిలో వాడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ఎస్ఓసీ ప్రాసెసర్... ఫిబ్రవరి 11న లాంఛ్ కానున్న సామ్సంగ్ గెలక్సీ ఎస్ 20 సిరీస్‌లో కూడా ఇదే వాడడం గమనార్హం.
షియోమీ ఎంఐ 10 సిరీస్ ఫీచర్లు
ఎంఐ 10 | ఎంఐ 10 ప్రో |
6.5 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే (90హెచ్‌డబ్ల్యూ రిఫ్రెష్ రేటు) | 6.5 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే(120 హెచ్‌డబ్ల్యూ రిఫ్రెష్ రేటు) |
ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ | ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ |
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ఎస్ఓసీ ప్రాసెసర్ | క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ఎస్ఓసీ ప్రాసెసర్ |
12 జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నెల్ స్టోరేజీ |