తెలంగాణ

telangana

ETV Bharat / business

షియోమీ ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్పెక్స్​ లీక్​! - Xiaomi Mi 10 and Mi 10 Pro Specs Leaks

షియోమీ ఎంఐ 10, ఎంఐ 10 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి. ఇవి 108 ఎంపీ ప్రైమరీ లెన్స్​, 66 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంఐ 6,8,9 స్మార్ట్​ఫోన్లను భారత్​కు తీసుకురాని షియోమీ.. ఎంఐ 10 విషయంలో కూడా అదే ఒరవడి కొనసాగించనున్నట్లు సమాచారం.

Xiaomi Mi 10 and Mi 10 Pro Specs Leaked
షియోమీ ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్పెక్స్​ లీక్​!

By

Published : Jan 7, 2020, 10:40 AM IST

చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ తన ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్లు ఎంఐ 10, ఎంఐ 10 ప్రోలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్ 865 ప్రాసెసర్​తో ఈ ఎంఐ 10 హ్యాండ్​సెట్​ను తీసుకురానున్నట్లు షియోమీ స్పష్టం చేసింది. అయితే వాటిని ఎప్పుడు ఆవిష్కరించనున్నారో మాత్రం స్పష్టం చేయలేదు.

2020 టెక్​ షోలో..

బార్సిలోనాలో జరగనున్న 2020 టెక్​ షోలో షియోమీ.. ఎంఐ 10, ఎంఐ 10 ప్రో ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్ల లాంచ్​​ చేయనున్నట్లు మాత్రం వార్తలొస్తున్నాయి.

వీబో ప్రకారం...!

చైనీస్​ మైక్రోబ్లాగింగ్ పోర్టల్​ వీబోలో... షియోమీ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ల ఫీచర్లు బహిర్గతం అయ్యాయి. వీటి ప్రకారం... ఎంఐ 10, ఎంఐ 10 ప్రోల్లో కెమెరా, బ్యాటరీ సామర్థ్యం, అధిక రీఫ్రెష్​​ రేట్ స్క్రీన్లు లాంటి అంశాలే తప్ప మిగిలిన ఫీచర్లన్నీ ఒకేలా ఉంటాయని తెలుస్తోంది.

ఎంఐ 10 ఫీచర్లు.! ఎంఐ 10 ప్రో ఫీచర్లు.!
6.5 అంగుళాల ఓఎల్​ఈడీ తెర 6.5 అంగుళాల ఓఎల్​ఈడీ స్క్రీన్
90 హెచ్​జడ్​ రీఫ్రెష్​ రేట్ స్క్రీన్​ 90 హెచ్​జడ్​ రిఫ్రెస్​ రేట్ స్క్రీన్​
ఇన్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్ స్కానర్​ ఇన్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​
క్వాల్​కామ్​ స్నాప్​ డ్రాగన్​ 865 ప్రాసెసర్​ క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్​ 865 ఎస్​ఓసీ
5జీ సపోర్ట్​ 5జీ సపోర్ట్​
12జీబీ ర్యామ్​+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 12జీబీ ర్యామ్​+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజి
4500 ఎంఏహెచ్ బ్యాటరీ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
40 వాట్​ వైర్డ్​ ​+30 వాట్​ వైర్​లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 66 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్
ఎంఐ 10 కెమెరా ఫీచర్లు..! ఎంఐ 10 ప్రో కెమెరా ఫీచర్లు..!
64ఎంపీ సోనీ ఐఎమ్​ఎక్స్686 సెన్సార్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరా లెన్స్​ (సామ్​సంగ్ సెన్సార్​)
20ఎంపీ సెకండరీ సెన్సార్​ 48 ఎంపీ సెకండరీ సెన్సార్​
12ఎంపీ థర్డ్​ సెన్సార్​ + 5ఎంపీ మాక్రో/డెప్త్​ సెన్సార్​ 12 ఎంపీ థర్డ్ సెన్సార్ ​+ 8 ఎంపీ డెప్త్​/మాక్రో సెన్సార్​
30 ఎక్స్​ డిజిటల్​ జూమ్ ఫీచర్​ (ఉండొచ్చు) 30 ఎక్స్​ డిజిటల్​ జూమ్ ఫీచర్​ (ఉండొచ్చు)

భారత్​ కోసం ఓ వ్యూహం

షియోమీ చివరిసారిగా తన ఫ్లాగ్​షిప్ ఫోన్​ ఎంఐ 5ను భారత్​ మార్కెట్​లో విడుదల చేసింది. దాని తరువాత వచ్చిన ఎంఐ 6,8,9 స్మార్ట్​ఫోన్లను భారత్​కు తీసుకురాని షియోమీ.. ఎంఐ 10 విషయంలో కూడా అదే ఒరవడి కొనసాగించనున్నట్లు సమాచారం.

భారత్​ విషయంలో షియోమీ భిన్నమైన వ్యూహాన్ని అమలుచేస్తోంది. రెడ్​మీ, పోకో బ్రాండ్లపై మాత్రమే ప్రస్తుతం దృష్టిసారించింది.

ఇదీ చూడండి: రివర్స్​ స్వింగ్​... భారీ లాభాల్లో స్టాక్​మార్కెట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details