తెలంగాణ

telangana

ETV Bharat / business

'షావోమి' భారీ మోసం.. రూ.653 కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేత - షావోమి ఇండియా కస్టమ్స్​ సుంకం ఎగవేత

Xiaomi import duty evasion: షావోమి సంస్థ భారత విభాగం రూ.653 కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేతకు పాల్పడింది. ఆ సంస్థకు చెందిన ప్రాంగణాల్లో జరిపిన సోదాల్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇందుకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ సంస్థకు షోకాజ్​ నోటీసులను కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసింది.

Xiaomi import duty evasion
షావోమి సుంకం ఎగవేత

By

Published : Jan 5, 2022, 6:41 PM IST

Xiaomi import duty evasion: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ షావోమి భారత విభాగం... భారీ మోసానికి పాల్పడినట్లు తేలింది. రూ.653 కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేత ఆరోపణలతో ఆ సంస్థకు కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు జారీ చేసింది. షావోమి ఇండియాకు చెందిన ప్రాంగణాల్లో జరిపిన సోదాల్లో... దిగుమతి సుంకం ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలను డైరెక్టర్ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్​ఐ)​ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో.. ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం తెలిపింది.

Show cause notices to xiaomi: అయితే... తమకు నోటీసులు పంపించడంపై షోవోమి సంస్థ ఇంకా స్పందించలేదు. డీఆర్​ఐ సోదాల్లో.. షోవోమి ఇండియా, ఆ సంస్థ కాంట్రాక్టుదారులు... దిగుమతి చేసుకున్న వస్తువుల అంచనా విలువలో రాయల్టీ, లైసెన్సు రుసుమును చెల్లించలేదని తేలింది. ఇది కస్టమ్స్​ నియమాలను ఉల్లంఘించడమే అవుతుందని డీఆర్ఐ తెలిపింది.

"మొబైల్​ ఫోన్ల, వాటి పరికరాల వంటివి దిగమతి చేసుకుంటూ... లావాదేవీ విలువలో రాయల్టీ, లైసెన్సు రుసుమును జోడించకుండా కస్టమ్స్​ సుంకాన్ని షావోమి ఇండియా సంస్థ ఎగవేస్తోంది. డీఆర్​ఐ పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత.. షోవోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​ సంస్థకు మూడు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. కస్టమ్స్​ చట్టం 1962 ప్రకారం... 2017 ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్​ 30 మధ్య రూ.653 కోట్ల కస్టమ్స్​ సుంకాన్ని చెల్లించాలని ఆదేశించాం."

-కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

కస్టమ్స్​ సుంకాన్ని 'షావోమి' ఎగవేస్తోందని నిఘా వర్గాలు ఇచ్చిన సమచారంతో డీఆర్​ఐ అధికారులు.. షోవోమి ప్రాంగణాల్లో సోదాలు జరిపారు. దాంతో ఈ పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి.

ఇదీ చూడండి:Reliance Jio: రిలయన్స్​ జియో రూ.5వేల కోట్ల బాండ్లు విక్రయం?

ఇదీ చూడండి:కొత్తగా బ్యాంక్ లాకర్ తీసుకోవాలా? ఈ రూల్స్ తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details