షావోమి ఓ ఫాస్ట్ ఛార్జర్‌ను సిద్ధం చేసింది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అయినా 20 నిమిషాల్లోపు ఫుల్ ఛార్జి చేయడం దాని ప్రత్యేకత. షావోమి వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్లను తీసుకురావడం కొత్తేమీ కాదు. గతంలో 50 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ ఛార్జర్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసింది. ఇప్పుడు 80 వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్‌ను రూపొందించింది. ఇది 4,000 బ్యాటరీని 19 నిమిషాల్లో పూర్తి ఛార్జి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను షావోమి తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసింది.
కొత్త వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్‌ను సిద్ధం చేసిన షావోమి - xiaomi latest news
ఇన్‌స్టంట్ ఫుడ్ తినడం అలవాటైన రోజులివి. మొబైల్ ఛార్జింగ్ విషయంలోనూ యూజర్లు వేగం కోరుకుంటున్నారు. వినియోగదారలు ఆసక్తి అనుగుణంగా ఓ అడుగు ముందుకేసిన షావోమి వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్‌ను సిద్ధం చేసింది.
కొత్త వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్‌ను సిద్ధం చేసిన షావోమి
వచ్చే ఏడాది 100 వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్లు వస్తాయని టెక్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే, అది ఏ సంస్థ నుంచి వస్తుందో చెప్పలేదు. ఇప్పుడు షావోమిఛార్జర్‌ను చూస్తుంటే 100 వాట్ ఛార్జర్ షావోమినుంచే వచ్చేలా కనిపిస్తోంది. మిగిలిన సంస్థలు కూడా ఆ ప్రయత్నం చేయొచ్చు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో వచ్చే ఎంఐ 11 సిరీస్‌తో 80 వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్‌ను లాంచ్ చేస్తారని అంటున్నారు. చూద్దాం ఈ ఫాస్ట్ ఛార్జర్ల పరుగు ఎంతవరకు వెళ్తుందో.
Last Updated : Oct 20, 2020, 10:15 AM IST