తెలంగాణ

telangana

ETV Bharat / business

​రెడ్​మీ 8ఏలో మరిన్ని ఫీచర్లతో 'డ్యూయెల్​' ఫోన్లు

చైనా ఎలక్ట్రానికి దిగ్గజం షియోమీ... రెడ్​మీ 8ఏకు డ్యూయెల్ కెమెరా సెటప్​ను జతచేసింది. దీనికి 'రెడ్​మీ 8ఏ డ్యూయెల్' అనే పేరు పెట్టాలని భావిస్తోంది. భారత్​లో దీని ధర రూ.6,499గా నిర్ణయించింది.

Xiaomi Redmi 8A Dual
రెడ్​మీ 8ఏ డ్యూయెల్​

By

Published : Feb 12, 2020, 11:26 AM IST

Updated : Mar 1, 2020, 1:56 AM IST

చైనా ఎలక్ట్రానిక్​ దిగ్గజం షియోమీ తన బడ్జెట్ ఫోన్​ 'రెడ్​మీ 8ఏ డ్యూయెల్'ను భారత్​లో ఫిబ్రవరి 18న విడుదల చేయనుంది. అమెజాన్ ఇండియా, ఎమ్​ఐ.కామ్​లో ఇది అందుబాటులో ఉంటుంది.

'రెడ్​మీ 8ఏ డ్యూయెల్' ఫీచర్లు

  • 6.22 అంగుళాల హెచ్​డీ+స్క్రీన్
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్​ ప్రొటెక్షన్​
  • డాట్​ నాచ్​ డిస్​ప్లే
  • ఐపీఎస్​ ఎల్​సీడీ ప్యానెల్
  • క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 439 ఎస్​ఓసీ
  • యూఎస్​బీ టైప్​-సీ పోర్టు
  • 5000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ
  • 18డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్టు (అయితే రిటైల్ బాక్స్​లో ఇది లభించదు. విడిగా కొనుక్కోవాలి.)
  • మైక్రో ఎస్​డీ స్లాట్​ (నిల్వ సామర్థ్యాన్ని 512జీబీ వరకు విస్తరించుకోవచ్చు)

కెమెరా..

  • 12ఎంపీ ప్రాథమిక కెమెరా (గూగుల్ లెన్స్ సపోర్టు)
  • 2ఎంపీ డెప్త్ సెన్సార్​
  • 8ఎంపీ సెల్ఫీ కెమెరా

మరిన్ని ఫీచర్లు..

రెడ్​మీ 8ఏ డ్యూయెల్... డ్యూయెల్ 4డీ, వోల్టే, వోవి-ఫై, వైఫై 802.11/బీ/జీ/ఎన్​, బ్లూటూత్​ 5.0, జీపీఎస్​, యూఎస్​బీ టైప్​-సీ పోర్టును కలిగి ఉంది. ఫోన్ దిగువ భాగంలో టైప్​సీ పోర్టు పక్కన 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జాక్ కూడా ఉంది. ఎఫ్​ఎమ్​ రేడియా, శక్తిమంతమైన స్పీకర్లు కూడా ఉన్నాయి.

మూడు రంగుల్లో...

ఈ ఫోన్​ సీబ్లూ, మిడ్​నైట్ గ్రే, స్కైవైట్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. రెడ్​మీ 8ఏలోని ఆరా వేవ్​ గ్రిప్​ డిజైన్​ను మెరుగుపరిచిన షియోమీ... రెడ్​మీ 8ఏ డ్యూయెల్​ను ఆరా ఎక్స్​గ్రిప్ డిజైన్​తో రూపొందించింది.

రెండు వేరియంట్లలో

రెడ్​మీ 8ఏ మాదిరిగానే రెడ్​మీ 8ఏ డ్యూయెల్​ కూడా రెండు వేరియంట్లలో వస్తుంది. 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.6,499; 3జీబీ+32జీబీ వేరియంట్​ ధర రూ.6,999.

రెడ్​మీ 8ఏ సంగతేంటి?

భారత మార్కెట్లోకి రెడ్​మీ 8 డ్యూయెల్ తీసుకొచ్చిన నేపథ్యంలో రెడ్​మీ 8ఏను నిలిపివేస్తుందా? లేదా? రాబోయే రోజుల్లో దాని ధర తగ్గిస్తుందా? అనే విషయాలు షియోమీ వెల్లడించలేదు.

రియల్​మీ సీ3తో పోటీ

రెడ్​మీ 8ఏ డ్యూయెల్​కు​.. రియల్​మీ సీ3 నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. రియల్​మీ సీ3లో శక్తివంతమైన మీడియాటెక్ హెలియో జీ70ఎస్​ఓసీ ఉంది. అయితే షియోమీ త్వరలో విడుదల చేయనున్న రెడ్​మీ 9లో దీనిని పొందుపరిచింది.

ఇదీ చూడండి:కొవిడ్​-19 భయాలు పక్కనపెట్టి.. స్టాక్​మార్కెట్ల జోరు

Last Updated : Mar 1, 2020, 1:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details