ఆహారేతర పదార్థాల ధరల్లో తగ్గుదలతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కనిష్ఠ స్థాయికి చేరుకుంది. గత సెప్టెంబర్ నెలలో 0.33 శాతంగా నమోదైంది. ఈమేరకు గణాంకాలు విడుదల చేసింది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ. ఆగస్టులో ఇది 1.08 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.
కనిష్ఠస్థాయికి పడిపోయిన టోకు ద్రవ్యోల్బణం - కనిష్ఠస్థాయికి పడిపోయిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంపై సెప్టెంబర్ నెలకు సంబంధించి గణాంకాలు విడుదల చేసింది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ. టోకు ద్రవ్యోల్బణం 0.33 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.
కనిష్ఠస్థాయికి పడిపోయిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత వార్షిక ద్రవ్యోల్బణం 2018 సెప్టెంబర్లో 5.22 శాతంగా నమోదైంది.
ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 7.47 శాతంగా ఉంది. ఆహారేతర పదార్థాల ద్రవ్యోల్బణం 2.18శాతంగా ఉన్నట్లు వెల్లడైంది.