ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది స్మార్ట్ఫోన్ మార్కెట్ కాస్త గడ్డు కాలం ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ సంస్థ సర్వేలో 2019లో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 2 శాతం క్షిణించినట్లు తేలింది. 2008 తర్వాత అమ్మకాలు క్షీణించడం ఇదే తొలిసారి అని గార్ట్నర్ నివేదిక తెలిపింది.
ఈ ఏడాది సానుకూలమే..
గత ఏడాది అమ్మకాలు కాస్త క్షీణించినప్పటికీ.. స్మార్ట్ఫోన్ల వ్యాపారం ఈ ఏడాది తిరిగి పుంజుకుంటుందని నివేదిక అంచనా వేసింది. 2020లో మొత్తం 1.57 బిలియన్ యూనిట్లు విక్రయమయ్యే అవకాశముందని పేర్కొంది.
5జీ వస్తోంది..
ముఖ్యంగా 5జీ సాంకేతికత అనేక దేశాలకు విస్తరించనుండటం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పెరిగేందుకు ఊతమందించనున్నట్లు గార్ట్నర్ నివేదిక తెలిపింది.
మరోవైపు ఫోన్ల ధరలు తగ్గుతాయని గత ఏడాది కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వాళ్లు ఈ ఏడాది అందుకు సరైన సమయంగా భావించొచ్చని.. ఫలితంగా స్మార్ట్ఫోన్ మార్కెట్లో వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేసింది.
ఈ ఏడాది మొత్తం మీద 221 మిలియన్ల 5జీ స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యే అవకాశముందని.. 2021 నాటికి వీటి సంఖ్య 489 మిలియన్లకు చేరే అవకాశముందని నివేదిక అభిప్రాయపడింది.