రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా పేరు పొందిన గొప్ప వ్యక్తి. ఈ దిగ్గజ వ్యాపారవేత్తకు కొన్ని అభిరుచులూ, ఇష్టాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కార్ల సేకరణ. అందుకే ఆయన గ్యారేజ్‌లో విలువైన కార్లు దర్శనమిస్తాయి. పాత తరం నుంచి లేటెస్ట్ మోడళ్ల వరకు ఎన్నో కార్లను ఆయన సొంతం చేసుకున్నారు. వాటిల్లో టాటా నిక్సన్, మెర్సిడెస్ బెంజ్, కార్డిల్లాక్ ఎక్స్ఎల్ఆర్, క్రిస్లెర్ సెబ్రింగ్, టాటా ఇండిగో వంటి ఎన్నో రకాలు ఉన్నాయి. ఆ కలెక్షన్లోని కొన్ని లగ్జరీ కార్లపై ఓ లుక్కేద్దాం.
లాండ్ రోవర్ ఫ్రీ లాండర్:
ఎలాంటి వాతావరణంలోనైనా, కొండల్లోనైనా దూసుకెళ్లగల సత్తా ఈ కారు సొంతం. 2014లోనే ఈ మోడల్ తయారీని నిలిపివేసినా.. అంతకుముందే టాటా దీన్ని సొంతం చేసుకున్నారు. నాలుగు సిలిండర్లు కలిగిన డీజిల్ ఇంజిన్ ఇందులో ఉంటుంది. ఇది 187 బీహెచ్పీ(బ్రేక్ హార్స్ పవర్), 420 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6 గేర్లతో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. దీని ధర రూ.44 కోట్ల నుంచి ప్రారంభం(ఎక్స్ షోరూమ్).
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్:
వావ్ అనిపించే డిజైన్, చూడగానే ఆకట్టుకునే రంగు ఈ లగ్జరీ కారు సొంతం. తొలిచూపులోనే ఎవరైనా దీనిమాయలోపడాల్సిందే. అందుకే టాటాను కూడా మెప్పించగలిగింది. జర్మనీ సంస్థ తయారు చేసిన ఈ ఎస్ మోడల్ కారును ఆయన సొంతం చేసుకున్నారు. 3982 వీ8 పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, గంటకు 300 కి.మీ. వేగం ఈ కారు ప్రత్యేకతలు. లీటరుకు 7 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ధర రూ.2.55 కోట్లు(ఎక్స్ షోరూమ్)
టాటా నెక్సాన్:
టాటా మోటార్స్ సంస్థ తయారు చేసిన ఈ కార్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అందుకే మిగతా వాటితో పోలిస్తే తక్కువ ధర ఉన్నా ఈ ఎస్‌యూవీకి టాటా గ్యారేజ్‌లో చోటు దక్కింది. చూడటానికి స్పోర్ట్స్ కారులా ఉండటం, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్ల వల్ల దీనికి భారీ డిమాండ్ లభించింది. ఈ కారును రెండు రంగుల్లో విడుదల చేశారు. ఇందులో నీలం రంగు కారులో టాటా చాలాసార్లు కనిపించారు. ఈ మోడల్లో 1.2 లీటర్ల పెట్రోల్ టర్బో ఇంజిన్, 1.5 లీటర్ల ఇంజిన్‌తో రెండు రకాల కార్లు వచ్చాయి. దీని ధర రూ.6.95 లక్షలు(ఎక్స్ షోరూమ్)
ఫెరారీ కాలిఫోర్నియా:
ఎరుపు రంగు ఫెరారీ కాలిఫోర్నియా మోడల్‌ను కూడా రతన్ టాటా కొనుగోలు చేశారు. రెండు డోర్లు ఉండే ఈ ఓపెన్ టాప్ కారు అంటే టాటాకు చాలా ఇష్టం. అనేకమార్లు ఈ వాహనంపై కనిపించారు. 4.3 లీటర్ల వీ8 ఇంజిన్, 504 ఎన్ఎం టార్క్, 552 బీహెచ్పీ దీని సొంతం. ఈ ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ కారు ఉత్పత్తి మన దేశంలోజరగట్లేదు. ఫెరారీ విడుదల చేసిన అన్ని మోడళ్లలో ఇది బాగా ఆకట్టుకుంది. దీని ధర రూ.3.13 కోట్ల నుంచి ప్రారంభం(ఎక్స్ షోరూమ్)
మసెరటి క్వట్రోపోర్టే: