తెలంగాణ

telangana

ETV Bharat / business

WC19: టీవీల అమ్మకాలు పెంచిన 'క్రికెట్​ ప్రేమ' - క్రికెట్ ప్రేమిమకులు

మే నెలలో టీవీల అమ్మకాలు 25-30 శాతం మేర పుంజుకున్నాయని తాజా గణాంకాల్లో తేలింది. ప్రపంచకప్ హవాతో క్రికెట్ అభిమానులు టీవీల కొనుగోళ్లపై ఆసక్తి చూపడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు వ్యాపారులు.

టీవీల అమ్మకాలు వృద్ధి

By

Published : Jun 1, 2019, 3:18 PM IST

Updated : Jun 1, 2019, 3:24 PM IST

ఎన్నికల హడావుడి ముగిసింది. దేశంలో ఇప్పుడంతా ప్రపంచ కప్​ హవానే ఉంది. మే 30న ప్రారంభమైన ఈ మెగా టోర్నీ​ జులై 14 వరకు సాగనుంది. అయితే ఈ సారి క్రికెట్ ప్రేమికులకు వినోదం అందించడం మాత్రమే కాదు.. టీవీ వ్యాపారులకూ భారీ అమ్మకాలను తెచ్చిపెడుతోంది ప్రపంచ కప్​.

ప్రపంచ కప్ ఆరంభానికి ముందే టీవీల అమ్మకాలు ఊపందుకున్నాయంటున్నారు వ్యాపారులు. తాజా గణాంకాల ప్రకారం.. మే నెల మొదటి వారంలో 25-30 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు టీవీల కొనుగోలు జరపడమే ఇందుకు కారణమంటున్నారు.

ఎప్పుడు ప్రపంచ కప్ వచ్చినా టీవీల అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈ సారీ ఆ జోరు కొనసాగుతోందని అంటున్నారు వ్యాపారులు.

32 అంగుళాల టీవీలపైనే ఎక్కువ మోజు

టీవీ అమ్మకాల్లో ఆధిక శాతం 32 అంగుళాల పరిమాణంలో ఉన్నవాటివేనంటున్నాయి మార్కెట్​ వర్గాలు. ఇందుకు కారణం లేకపోలేదు.. 32 అంగుళాల టీవీలపై జీఎస్​టీ 18 శాతం శ్లాబులో ఉండగా.. అంతకన్నా పెద్ద పరిమాణంలోని టీవీలు 28 శాతం శ్లాబులో ఉన్నాయి.

అన్​లైన్​లో, ఆఫ్​లైన్​లో అదే జోరు

అన్​లైన్, ఆఫ్​లైన్​ రిటైల్ మార్కెట్లు రెండింటిలోనూ టీవీల అమ్మకాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగేతర రుణ సంస్థలు అందించే నో-కాస్ట్​ ఈఎంఐలతో.. పెద్ద టీవీలను కొనేందుకు వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.వీటికి తోడు ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్​కార్డ్​లు ఇస్తున్న ఎక్స్చేంజ్,​ ఇతర ఆఫర్లతో 4కే, స్మార్ట్​ టీవీలు, పెద్ద పరిమాణ టీవీలకు గిరాకీ భారీగా ఉన్నట్లు తెలిపాయి.

టీవీలు ఇచ్చే అనుభూతే వేరు...

చాలా మంది ఆన్​లైన్ ప్లాట్​ఫారాల్లో క్రికెట్​ను ఆస్వాదిస్తున్నారు. కానీ టీవీలో చూసిన అనుభూతి మాత్రం అవి అందించవన్నది పలువురు క్రికెట్ అభిమానుల మాట.

Last Updated : Jun 1, 2019, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details