మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామి గంగే పథకానికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయానికి ముందుకొచ్చింది. గంగా ప్రక్షాళనకు సంబంధించి రూ.3,023.1 కోట్లు సాయం అందించనుంది.
"రెండో జాతీయ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్ట్ (ఎస్ఎన్జీఆర్బీపీ) ద్వారా గంగా నదిలో కాలుష్యాన్ని నివారించడానికి, నదీ పరీవాహక ప్రాంతాల నిర్వహణను బలోపేతం చేయడానికి ఈ నిధులు తోడ్పాటునిస్తాయి" అని ప్రపంచబ్యాంకు మంగళవారం ప్రకటించింది.
ఇందులో రూ. 2,879 కోట్లు రుణంగా అందిస్తుంది ప్రపంచ బ్యాంకు. మిగతా రూ.143 కోట్లు బ్యాంకు గ్యారంటీ కింద వర్తిస్తుందని జాతీయ గంగా ప్రక్షాళన మిషన్ వెల్లడించింది. ఈ ఒప్పందంపై ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్, వరల్డ్ బ్యాంకులో భారత ప్రతినిధి కైజర్ ఖాన్ సంతకం చేశారు.
నిధుల ఖర్చు ఇలా..