తెలంగాణ

telangana

ETV Bharat / business

Economy: 'భారత వృద్ధి రేటు 8.3 శాతమే!' - భారత వృద్ధిరేటు 8.3 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు (Economy) 8.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది ప్రపంచ బ్యాంక్​. 2022-23 లో 7.5 శాతం 2023-24లలో 6.5 శాతం వృద్ధిరేటు నమోదుకావొచ్చని పేర్కొంది.

World Bank slashes India economy growth
వృద్ధిరేటుపై కరోనా ప్రభావం

By

Published : Jun 9, 2021, 8:43 AM IST

Updated : Jun 9, 2021, 9:50 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు (Economy) అంచనాలను ప్రపంచ బ్యాంక్​ తగ్గించింది. గత ఏప్రిల్​లో 10.1 శాతం వృద్ధిరేటు లభిస్తుందని అంచనా వేయగా, తాజాగా 8.3 శాతానికి తగ్గించింది. 2022-23లో 7.5 శాతం 2023-24 లో 6.5 శాతం వృద్ధిరేటు నమోదు కావొచ్చని పేర్కొంది. కొవిడ్​ మొదటి దశ పరిణామాల నుంచి ఆర్థిక వ్యవస్థ (Economy) పునరుత్తేజితం అవుతున్న క్రమంలో, రెండో దశ కేసుల పట్ల ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించింది.

కొవిడ్​ రెండో దశతో..

గత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయార్థంలో భారత వృద్ధి అంచనాలకు మించి పుంజుకుందని, సేవల రంగం గణనీయంగా రాణించిందని తెలిపింది. అయితే.. కొవిడ్​ రెండో దశ వ్యాప్తి వల్ల రికవరీ దెబ్బతింటోందని ప్రపంచ బ్యాంక్​ అభిప్రాయపడింది. 2019లో 4 శాతం వృద్ధి సాధించిన భారత​ ఆర్థిక వ్యవస్థ (Economy) 2020-21లో 7.3 శాతం క్షీణించింది. విధానపరమైన తోడ్పాటు, మౌలిక రంగంపై అధిక వ్యయాలు, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, సేవలు, తయారీ రంగాల్లో అంచనాలకు మించిన రికవరీ వంటి అంశాలు ఈ ఏడాది వృద్ధికి కలిసొస్తాయని వివరించింది. ఏప్రిల్​, మే నెలల్లో అనూహ్యంగా పెరిగిన కొవిడ్​ కేసులు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి.

అంతర్జాతీయ వృద్ధి 5.6%: 2021 లో ప్రపంచ వృద్ధి 5.6 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్​ అంచనా వేసింది. గత 80 ఏళ్లలో మాంద్యం తర్వాత ఇదే బలమైన వృద్ధిగా అభివర్ణించింది. పలు అగ్రగామి దేశాలు బలంగా పుంజుకోవడమే ఇందుకు నేపథ్యంగా వెల్లడించింది. ఈ ఏడాది చైనా వృద్ధి 8.5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.

ఇదీ చదవండి:IT Returns: కొత్త సైట్లో సాంకేతిక సమస్యలు

2 డీజీ పరిజ్ఞానం బదిలీకి డీఆర్‌డీఓ సంసిద్ధత

Last Updated : Jun 9, 2021, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details