కరోనా కారణంగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తమ ఉద్యోగులతో ఏడాదంతా ఇంటి నుంచే పని చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతనెలలో జూన్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగించిన గూగుల్.. దానిని 2020 ఏడాది ముగిసే వరకు పెంచినట్లు సమాచారం.
'గూగుల్' ఉద్యోగులకు ఏడాదంతా వర్క్‌ఫ్రమ్ హోమ్!
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. తప్పనిసరి ఉద్యోగులను మాత్రం జులై నుంచి కార్యాలయానికి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తుంది.
ఫేస్‌బుక్ బాటలోనే గూగుల్... ఏడాదంతా వర్క్‌ఫ్రమ్ హోమ్!
జూన్ లేదా జులై మొదటికి గూగుల్ కార్యాలయం తెరిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన ఆ సంస్థ.. తప్పనిసరి ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి వచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. వారికి వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్త చర్యలూ చేపట్టనున్నట్లు గూగుల్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఫేస్‌బుక్ కూడా ఏడాదంతా తమ ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేయాలని ఆదేశించింది.