Work From Office News: కొవిడ్ కేసుల తీవ్రత బాగా తగ్గడం వల్ల సిబ్బందిని కార్యాలయాలకు రప్పించడంపై ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అయితే బలవంతపెట్టడం లేదు. 'కార్యాలయాలకు వచ్చే సంగతి తరువాత.. ముందుగా ఉద్యోగం చేసే నగరం/పట్టణాని (బేస్ లొకేషన్)కి రావాలని' దిగ్గజ కంపెనీలు సూచిస్తున్నాయి. గత నవంబరులోనూ కొవిడ్ కేసుల తీవ్రత బాగా తగ్గినట్లే అనిపించినా, మళ్లీ శరవేగంగా పెరగడం, గత వేసవిలోనూ రెండోదశ విజృంభించడాన్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బందిని రప్పించడంలో ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
మరోవైపు ఇంటి నుంచైనా పని సాఫీగా నడుస్తుండడం వల్ల ఒత్తిడి తేవడంలేదు. వాస్తవానికి ఐటీ నియామక నిబంధనల ప్రకారం బేస్ లొకేషన్ నుంచే పనికి అనుమతి ఉంటుంది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిబంధన నుంచి వెసులుబాటు కల్పించి, ఎక్కడినుంచైనా అనుమతిస్తున్నారు. అయితే ఎక్కడినుంచి లాగిన్ అవుతున్నారో తెలుసుకునేందుకు కొన్ని కంపెనీలు జీపీఎస్ సాంకేతికతను వినియోగిస్తున్నాయి.
నిపుణులు చేజారకుండా సున్నితంగా..
కొత్తతరం సాంకేతికతలపై నైపుణ్యాలు కలిగిన వారికి గిరాకీ అధికంగా ఉండటంతో.. నిపుణులు చేజారకుండా చూసుకునేందుకు కంపెనీలు సిబ్బందితో సున్నితంగా వ్యవహరిస్తున్నాయి. కార్యాలయానికి తప్పనిసరిగా రావాలంటే, వేరే కంపెనీకి మారతారేమోననే ఆందోళనా సంస్థల్లో ఉంది. అందుకే కంపెనీకి వచ్చి పనిచేసుకోవచ్చని, కస్టమర్లను కలవవచ్చని మాత్రమే నిపుణులకు సూచిస్తున్నాయి. ఉద్యోగుల్లో స్ఫూర్తి కలిగించేందుకు ఆయా కంపెనీల ఉన్నతాధికారులు వారానికి రెండు, మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్నారు.
కస్టమర్లూ వస్తున్నారు.
'కొవిడ్ తీవ్రత సమయంలోనూ మా కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. అయితే ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేశారు. ప్రాజెక్టులు ఇచ్చే ఖాతాదారులు కూడా ఐటీ సంస్థల ప్రాంగణాలకు వస్తున్నారు. నేను కూడా కస్టమర్లను కలిసేందుకు పర్యటనలు ప్రారంభించా' అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీనియర్(టీసీఎస్) వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్న తెలిపారు. తమ సంస్థలో తనతో సహా నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు వారానికి 2-3 రోజులు ఆఫీసుకు వెళ్లి పనిచేస్తున్నామని, కీలక ప్రాజెక్టుల్లో ఉన్నవారు కూడా వస్తున్నారని తెలిపారు.
టీసీఎస్
హైదరాబాద్ పరిధిలో దాదాపు 70,000 మంది ఉద్యోగులుండగా, కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్న వారు 2,000 మందిలోపే. బేస్ లొకేషన్‌కు వచ్చి పనిచేసుకోవాలని ఉద్యోగులకు కంపెనీ సూచిస్తోంది. మార్చి కల్లా 10 శాతం మంది కార్యాలయాలకు రావచ్చని అంచనా వేస్తోంది. క్రమంగా ఇది పెరుగుతుందని భావిస్తోంది.
ఇన్ఫోసిస్
హైదరాబాద్ పరిధిలో దాదాపు 50,000 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు 2-3 శాతం మందే వస్తున్నారు. మార్చి నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. రాబోయే 3-4 నెలల్లో ఎక్కువ శాతం మంది కార్యాలయాలకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు.
విప్రో