తెలంగాణ

telangana

ETV Bharat / business

మహిళలదే హవా: పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు..! - ఉద్యోగాల కల్పనలో మహిళల పాత్ర

రానున్న పదేళ్లలో భారత్​లో ఉద్యోగ వయసున్న 25 శాతం మందికి మహిళా పారిశ్రామికవేత్తలే ఉపాధి కల్పిస్తారని ఓ నివేదిక తెలిపింది. 2030 నాటికి 15 నుంచి 17 కోట్ల మందికి వారే ఉద్యోగాలు కల్పిస్తారని అంచనా వేసింది.

Women entrepreneurs can generate 150-170 mn jobs in India
17 కోట్ల ఉద్యోగాలు మహిళలే సృష్టిస్తారు

By

Published : Feb 19, 2020, 9:49 AM IST

Updated : Mar 1, 2020, 7:43 PM IST

భారత్‌లో 2030 నాటికి మహిళా పారిశ్రామికవేత్తలు 15-17 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని గూగుల్‌, బెయిన్‌ అండ్‌ కంపెనీ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఉద్యోగ వయసున్నమొత్తం జనాభాలో 25 శాతానికి పైగా కొత్త ఉద్యోగాలు మహిళలే సృష్టిస్తారని అందులో తెలిపింది.

భారత్‌లో ఉన్న మొత్తం సంస్థల్లో సుమారు 20 శాతం (1.35-1.57 కోట్లు) సంస్థలు మహిళల ఆధీనంలోనే ఉన్నాయని పేర్కొంది ఈ నివేదిక.

మహిళా పారిశ్రామికవేత్తల చేతిలో ఉన్న సంస్థల ద్వారా ప్రస్తుతం 22 నుంచి 27 మిలియన్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతోందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: పెరగనున్న ఎల్​ఈడీ బల్బుల ధరలు!

Last Updated : Mar 1, 2020, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details