నోట్ల ఉపసంహరణ పై వస్తోన్న వదంతులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. నోట్ల ఉపసంహరణ అనేది లేదని స్పష్టం చేసింది. రూ.100, రూ.10, రూ.5 ల పాత నోట్లు చలామణిలోనే ఉంటాయని పేర్కొంది.
నోట్ల ఉపసంహరణపై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ - నోట్ల రద్దపై ఆర్బీఐ స్పందన
నోట్ల ఉపసంహరణపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. చలామణిలో ఉన్నరూ.100, రూ.10, రూ.5 పాత నోట్లు యథాతథంగా ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది.
నోట్ల రద్దుపై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
ఈ 3 రకాల పాతనోట్లను భవిష్యత్‌లోనూ రద్దు చేయటం లేదని ఆర్బీఐ ప్రకటించింది. నోట్ల రద్దుపై వస్తోన్న వదంతులను నమ్మోద్దని ప్రజలకు సూచించింది. దీనిపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. కొత్త నోట్లతో పాటు పాతవి కూడా చలామణిలో ఉంచుతామని తెలిపింది.
ఇదీ చూడండి:రూ.100 నోట్ల ఉపసంహరణ.. ఎప్పటినుంచో తెలుసా?