చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో ఆ దేశ యాప్‌లను నిషేధించిన భారత్.. డ్రాగన్‌కు మరో షాక్ ఇచ్చింది. భారత్‌లో చైనా పెట్టుబడులను కట్టడి చేసేలా సాధారణ ఆర్థిక నియమాలు-2017లో సవరణలు చేసింది. దీని ద్వారా ప్రభుత్వం జరిపే కొనుగోళ్లలో.. భారత్‌తో సరిహద్దు దేశాల బిడ్డర్లపై ఆంక్షలు విధించింది కేంద్రం. టెండర్లు వేసేందుకు సంబంధిత అధికారి వద్ద తప్పనిసరిగా నమోదై ఉండాలని స్పష్టం చేసింది.
" సామగ్రి, సేవలు( కన్సల్టెన్సీ, నాన్-కన్సల్టెన్సీ సేవలు సహా), ఇతర పనులు, ఏదైనా కొనుగోళ్ల కోసం వేలం వేయడానికి.. బిడ్డర్ సంబంధిత అథారిటీలో నమోదై ఉంటేనే అర్హులు అవుతారు. రిజిస్ట్రేషన్ కమిటీని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) ఏర్పాటు చేస్తుంది. రాజకీయ, భద్రత పరమైన అంశాల్లో విదేశాంగ, హోంశాఖల నుంచి అనుమతులు తప్పనిసరి."
- ఆర్థిక శాఖ
కొత్త ఆదేశాల పరిధిలోకి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందుతున్నవి వస్తాయని స్పష్టం చేసింది ఆర్థిక శాఖ.
సీఎస్‌లకు లేఖలు..