తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యూ2లో అదరగొట్టిన విప్రో, ఇన్ఫీ

దేశీయ కార్పొరేట్​ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్​ రెండో త్రైమాసిక ఫలితాల్లో సత్తాచాటాయి. విప్రో లాభం 17 శాతం వృద్ధి చెందగా.. ఇన్ఫోసిస్​ రూ. 5 వేల 421 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది.

క్యూ2లో దుమ్మురేపిన ఐటీ దిగ్గజాలు

By

Published : Oct 13, 2021, 5:12 PM IST

దేశీయ ఐటీ దిగ్గజం విప్రో 2021-22 రెండో త్రైమాసిక లాభం 17 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ కార్పొరేట్​ సంస్థ రూ. 2,930.6 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 2,484.4 కోట్లుగా ఉంది.

క్యూ2లో విప్రో ఆదాయం దాదాపు 30 శాతం పెరిగి.. రూ. 19 వేల 667 కోట్లకు చేరింది. గతేడాది రెండో త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 15 వేల కోట్లుగా ఉంది.

విప్రో ఐటీ సేవల విభాగ ఆదాయం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 2580 మిలియన్ డాలర్లుగా నమోదైనట్లు విప్రో పేర్కొంది.

ఇన్ఫోసిస్​..

భారత్​లోని రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్​ కూడా రెండో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. సంస్థ నికర లాభం 11.9 శాతం పెరిగి.. రూ. 5,421 కోట్లుగా నమోదైందని తెలిపింది. గతేడాది ఇదే సమయంలో.. రూ. 4,845 కోట్లుగా ఉంది.

ఆదాయం.. 20.5 శాతం పెరిగి రూ. 29 వేల 602 కోట్లకు చేరిందని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే.. షేరుకు రూ. 15 చొప్పున డివిడెండ్ ప్రకటించింది ఇన్ఫోసిస్​.

ఇదీ చూడండి:తక్కువ రిస్క్‌ కోసం స్టాక్స్‌ను ఇలా 'సిప్‌' చేయండి!

ABOUT THE AUTHOR

...view details