తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాపై పోరుకు విప్రో సాయం.. రూ.1,125 కోట్లు విరాళం

మహమ్మారిపై దేశం చేస్తోన్న పోరాటానికి తమ వంతు సాయంగా పలు కార్పొరేట్​ సంస్థలు భారీగా విరాళాలు ప్రకటించాయి. తాజాగా అజీమ్​ ప్రేమ్​జీ ఫౌండేషన్​, విప్రో సంస్థలు కలిసి రూ.1125 కోట్లు విరాళం ప్రకటించాయి.

Wipro, Azim Premji Foundation commit Rs 1,125 cr to tackle COVID-19 crisis
కరోనాపై పోరాటానికి విప్రో సాయం.. రూ.1,125 కోట్లు విరాళం

By

Published : Apr 1, 2020, 6:01 PM IST

దేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనాను అరికట్టేందుకు దిగ్గజ ఐటీ సంస్థ విప్రో దాని అనుబంధ సంస్థలు, అజీమ్​ ప్రేమ్​జీ ఫౌండేషన్​ కలిసి రూ.1,125 కోట్ల సాయం ప్రకటించి పెద్దమనసు చాటుకున్నాయి. ఈ వనరులు మహమ్మారిపై పోరాటానికి, వైరస్​ వ్యాప్తిని తగ్గించడానికి సహాయపడతాయని ఆ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ముఖ్యంగా మన సమాజంలో అత్యంత వెనకబడిన వర్గాలవారికి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడతాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

సమష్టిగా..

విప్రో లిమిటెడ్​ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్​ ప్రైజస్​ లిమిటెడ్​ రూ.25 కోట్లు, అజీమ్​ ప్రేమ్​జీ ఫౌండేషన్​ రూ.1000 కోట్ల మేర విరాళాలు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏడాదిలో చేసిన కార్పొరేట్​ సామాజిక బాధ్యత కార్యక్రమాలు కాకుండా.. అదనంగా ఈ సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విరాళాల వెల్లువ

ఇప్పటికే టాటా గ్రూపు రూ.1,500 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్​ రూ.500 కోట్లు, ఇన్​ఫోసిస్​ రూ.100 కోట్లు కరోనాపై యుద్ధం కోసం విరాళాలు అందించాయి.

ఇదీ చూడండి:'తిండి లేదు... బీర్లతోనే సరిపెట్టుకుంటున్నాం సార్'

ABOUT THE AUTHOR

...view details