దేశీయ విమాన ప్రయాణాలను మే 25 నుంచి పునరుద్ధరిస్తామని ప్రకటించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ.. అంతర్జాతీయ సర్వీసులపైనా దృష్టి పెట్టింది. ఆగస్టుకు ముందే అంతర్జాతీయ విమాన సేవలు పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమానయానమంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.
"అంతర్జాతీయ విమాన సేవలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం. వాటిని ఆగస్టు లేదా సెప్టెంబరు కంటే ముందే ప్రారంభించవచ్చు. తేదీని మాత్రం చెప్పలేను. అయితే పూర్తి స్థాయిలో మొదలుకాకపోవచ్చు."