ఈసారి దీపావళికి బంగారం (Gold News) మరింత మెరవనుంది. కరోనా ముందు స్థాయిలతో పోలిస్తే 30 శాతం వృద్ధితో విక్రయాలు నమోదవుతాయని ఆభరణ తయారీదార్లు విశ్వసిస్తుండడం ఇందుకు కారణం. ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే వేగంగా రికవరీ అవుతుండడం, ధరలూ (Gold Price) తక్కువగా ఉండడంతో గిరాకీ భారీగా పెరగవచ్చని వారు అంచనా వేస్తున్నారు. గతేడాది దీపావళి, ధనత్రయోదశి సమయంలో రత్నాభరణాల పరిశ్రమ దాదాపు సున్నా విక్రయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఎప్పటి నుంచి అంటే..
ఈ క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికం నుంచి పసిడి విక్రయాల్లో వృద్ధి నమోదవుతూ వచ్చింది. 10 గ్రాముల పసిడి రూ.42,500కు తగ్గడం వల్లే ఇది సాధ్యమైందని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి అంటోంది. కరోనా సమయంలో వాయిదా పడ్డ పెళ్లిళ్లు ఈ ఏడాది జరగడమూ కలిసొచ్చింది. ఒకానొక సమయంలో రూ.56,000కు చేరిన బంగారం ఇపుడు రూ.49,200 స్థాయిలో కదలాడుతోంది. టీకా కార్యక్రమం పెరగడం; కరోనా కేసులు తగ్గడంతో ఆర్థిక రికవరీ సాధ్యమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరకల్లా రత్నాభరణాల విక్రయాలు మరింత రాణిస్తాయని, 2019తో పోలిస్తే 20-25% మేర నమోదుకావొచ్చని మండలి అంచనా వేసింది.
జులై-సెప్టెంబరులో..