ఒకప్పుడు బంగారం కొనుగోలు, పెట్టుబడి అంటే కేవలం భౌతిక మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడున్న అధునాతక సాంకేతికత యుగంలో ఈ పద్ధతి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు బంగారంపై పెట్టుబడుల విషయంలో అనేక మార్గాలున్నాయి. సులభంగా బంగారం కొనుగోలు చేసే అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే తదితర పేమెంట్స్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా బంగారం సులభంగా ఒక్క క్లిక్‌తో కొనుగోలు చేసే వీలుంటుంది. దీనికోసం ఈ యాప్స్ ఎలాంటి ఛార్జీలను వసూలు చేయటం లేదు. అయితే 3 శాతం జీఎస్టీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ యాప్స్ ద్వారా 24 క్యారెట్స్ (99.9 శాతం స్వచ్ఛమైన) బంగారం కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ లాకర్ రూపంలో ఈ బంగారం దాచుకోవచ్చు. ఒకవేళ భౌతిక బంగారం కావాలనుకుంటే దానికి సంబంధించిన డెలివరీ ఆప్షన్‌ను కూడా యాప్స్ అందుబాటులో ఉంచుతున్నాయి.
ఈ యాప్స్ ద్వారా కేవలం కొనుగోలు మాత్రమే కాకుండా, విక్రయం కూడా చేసుకోవచ్చు. ఆ క్షణంలో ఉన్న ధరకు అనుగుణంగా బంగారం విక్రయించుకోవచ్చు.
ఈ యాప్స్ మాత్రమే కాకుండా పలు ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలుకు అవకాశం ఇస్తున్నాయి. అయితే బంగారంపై పెట్టుబడి విషయంలో డిజిటల్ గోల్డ్‌తో పాటు ఇతర డిజిటల్ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి యాప్స్ ద్వారా కొనుగోలు చేసినంత సులభం కాకపోయినా.. కొంత వరకు సౌకర్యంగానే ఉంటాయి.
గోల్డ్ ఈటీఎఫ్‌లు..
బంగారంపై పెట్టుబడి విషయంలో ఇతర మార్గాలను చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్‌లు ప్రధానమైనవి. అయితే ఈటీఎఫ్‌లలో పెట్టుబడికి డీమ్యాట్ ఖాతా తప్పకుండా ఉండాలి.