తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన టోకు ద్రవ్యోల్బణం- నవంబర్​లో 14.23 శాతం - నవంబర్​లో టోకు ద్రవ్యోల్బణం

Wholesale Price Inflation: టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) నవంబర్​లో 14.23 శాతంగా నమోదైంది. డబ్ల్యూపీఐ రెండంకెలపైన నమోదవడం వరుసగా ఇది ఎనిమిదో నెల కావడం గమనార్హం.

Wholesale Price Inflation
టోకు ద్రవ్యోల్బణం

By

Published : Dec 14, 2021, 1:42 PM IST

Wholesale Price Inflation: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) మళ్లీ పెరిగింది. నవంబర్​లో టోకు ద్రవ్యోల్బణం 14.23 శాతంగా నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగానే టోకు ద్రవ్యోల్బణం(Wpi inflation) ఎగబాకినట్లు పేర్కొంది.

డబ్ల్యూపీఐ(Wpi inflation) రెండంకెలపైన నమోదవడం వరుసగా ఇది ఎనిమిదో నెల కావడం గమనార్హం. అక్టోబరులో టోకు ద్రవ్యోల్బణం 12.54 శాతంగా ఉంది. గత ఏడాది నవంబర్​లో ద్రవ్యోల్బణం 2.29 శాతంగా ఉంది.

ఇదే కారణం..

మినరల్ ఆయిల్స్​, బేసిక్ మెటల్స్​, తయారీ వస్తువులు, ఆహార ఉత్పత్తులతో పాటు ఇతర వస్తువుల ధరలు పెరగడమే.. నవంబర్​లో టోకు ద్రవ్యోల్బణం పెరిగేందుకు ప్రధాన కారణమని కేంద్రం పేర్కొంది.

తయారీ వస్తువులపై టోకు ద్రవ్యోల్బణం నవంబర్​లో 11.92 శాతంగా నమోదైంది. ఇది గత నెలలో 12.04 శాతం మాత్రమే ఉంది.

ముడి చమురు ద్రవ్యోల్బణం నవంబర్​లో 91.74 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. ఇది అక్టోబర్​లో 80.57 శాతంగా ఉందని పేర్కొంది.

ఆహార వస్తువుల టోకు ద్రవ్యోల్బణం రెండింతలు పెరిగి 6.70 శాతానికి చేరింది. అక్టోబర్​ నెలలో ఇది 3.06శాతంగా ఉండేది.

ఇదీ చూడండి:మళ్లీ పెరిగిన రిటైల్​ ద్రవ్యోల్బణం- నవంబర్​లో 4.91శాతం

ABOUT THE AUTHOR

...view details