కోకాకోలా.. ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. వివిధ దేశాల్లో రవి అస్తమించని సామ్రాజ్యంగా ఏళ్ల తరబడి ఈ సంస్థ ప్రస్థానం కొనసాగుతోంది. సుమారు 200లకు పైగా దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉంది. ప్రపంచంలో అది పెద్ద శీతల పానీయం తయారీ సంస్థగా దీనికి పేరుంది. అయితే ఈ సంస్థకు యజమాని ఎవరో మీకు తెలుసా?
కొన్ని వేలకోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీకి యాజమాన్యం అయితే ఉంది కానీ.. సొంత యజమాని అంటూ ఎవరూ లేరు. ఈ సంస్థను తొలుత 1886లో జాన్ స్టిత్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ ప్రారంభించారు. అప్పటి నుంచి కోకాకోలా ఉత్పత్తి నిర్విరామంగా సాగుతోంది.
యజమాని లేని సంస్థ...
ఈ సంస్థకు ప్రారంభంలో ఓనర్ ఉన్నా.. అనంతరం చోటుచేసుకున్న మార్పుల్లో కేవలం యాజమాన్యం వరకే మాత్రమే పరిమితమైంది. ఇది అమెరికాలో పబ్లిక్ లిస్టేడ్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది షేర్హోల్డర్లు, పెట్టుబడుదారులు ఈ సంస్థకు ఉన్నారు. దీనికి అన్ని సంస్థల్లాగే బోర్డు ఉంది. దానిలో డైరెక్టర్లు ఉన్నారు. సంస్థకు చాలామంది ప్రొమోటర్లు కూడా ఉన్నారు. కంపెనీకి సంబంధించిన కీలక నిర్ణయాలు అన్నీ బోర్డులో చర్చించి సభ్యులు ఖరారు చేస్తారు. కానీ సొంతంగా యజమాని అంటూ ఎవరూ లేరు.
సంస్థలో ఎవరి వాటాలు ఎలా ఉన్నా.. అతి పెద్ద వాటాదురుడిగా మాత్రం ప్రపంచ బిలియనీర్ వారెన్ బఫెట్ కొనసాగుతున్నారు. దీనిలో 9.3 శాతం వాటాను ఆయన కొనుగోలు చేశారు.