తెలంగాణ

telangana

ETV Bharat / business

రియల్​ మీ '5ఎస్​' x వివో 'యూ20'.. ఏది​ బెస్ట్​? - latest phone news released in november

చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీలైన రియల్​మీ, వీవోలు భారత మార్కెట్లోకి రెండు రోజుల తేడాతో (నవంబర్ 20, 22వ తేదీల్లో) రెండు బడ్జెట్​ ఫోన్లను విడుదల చేయనున్నాయి. ధర, ఫీచర్ల విషయంలో రెండు ఫోన్లు దాదాపు ఒకే విధంగా ఉండనున్నట్లు సమాచారం. బడ్జెట్​లో స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేసేవారికి ఏ ఫోన్​ బెస్ట్​ అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

రియల్​ మీ '5s' x వివో 'యు20' ఏది బెస్ట్​?

By

Published : Nov 17, 2019, 6:32 PM IST

ఈ నెల 20వ తేదీన 'రియల్​మీ 5ఎస్​' మోడల్​నుభారత మార్కెట్లోకివిడుదల చేయనుందిఆ సంస్థ. ఇది రియల్​ మీ 5కి కొనసాగింపు. 'రియల్​ మీ'కి పోటీగా.. రెండు రోజుల వ్యవధిలోనే 'వివో యూ20' మోడల్​ను ఈ నెల 22వ తేదీన మార్కెట్లో ఆవిష్కరించనుంది వివో. ఇది వివో 'యూ' సిరీస్​కు చెందింది. దీంతో ఈ స్మార్ట్​ఫోన్ల మధ్య తీవ్ర పోటీ నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు సంస్థల ఫీచర్లు, ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ ఫీచర్లు ఎలా ఉండనున్నాయో పోల్చి చూద్దాం.

రెండు ఫోన్ల ఫీచర్లు అంచనాలు..

వివో యూ20 రియల్​ మి 5ఎస్​
6.3 అంగుళాల తెర ఫుల్ హెచ్​డీ 6.5 అంగుళాల ఫుల్ హెచ్​డీ తెర..
క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్​ స్నాప్​డ్రాగన్ 665 ఎస్​ఓసీ ప్రాసెసర్​
ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్​ అండ్రాయిడ్​ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్
6 జీబీ ర్యామ్ 4జీబీ ర్యామ్​
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ స్టోరేజీ
1080 x 2340 పిక్సెల్​ రిజల్యూషన్ ​ 720x1600 పిక్సెల్​ రిజల్యూషన్​
ట్రిపుల్ రియర్​​ కెమెరా 16+8+2 ఎంపీ క్వాడ్​ రియర్​ కెమెరా (48+8+2+2 మెగా పిక్సెళ్లు)
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 5000, ఎంఏహెచ్​ బ్యాటరీ.

వివో యూ20 x రియల్​మీ 5ఎస్​..

దాదాపు వీటి ఫీచర్లు ఒకే లాగా ఉన్నాయి. ర్యామ్​, ఇంటర్నల్​ స్టోరేజ్, పిక్సల్​ రిజల్యూషన్​​ ప్రకారం వివో యూ20 ముందు వరుసలో ఉంది. రియర్​ కెమెరా విషయంలో 'రియల్​ మీ 5ఎస్​' ముందు ఉంది. రెండు ఫోన్ల బ్యాటరీ సామర్థ్యాలు ఒకేలా ఉన్నాయి. ఇక ధర విషయానికొస్తే.. వీవో యూ20 ధర రూ.11,999 గాను, రియల్​ మీ 5ఎస్​ ధర రూ.9,999 గా ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బడ్జెట్​ ఫోన్ 'రెడ్​ మీ నోట్​ 8' తోనూఈ రెండు ఫోన్లు పోటీ పడనున్నాయి.

ఇదీ చూడండి : ఫాస్టాగ్​తో​ టోల్​ వసూలు కోసం ప్రత్యేక అధికారులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details