తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2022, 5:26 AM IST

Updated : Jan 25, 2022, 6:35 AM IST

ETV Bharat / business

వాట్సాప్​ సరికొత్త అప్​డేట్​- డెస్క్​టాప్​ వెర్షన్​లోనూ..

WhatsApp Two step verification: వాట్సాప్‌ మరో అప్​డేట్​తో రానుంది. డెస్క్‌టాప్‌ యాప్, వెబ్‌ వెర్షన్‌లోనూ రెండు దశల ధ్రువీకరణను (టూ స్టెప్ వెరిఫికేషన్) తీసుకురానుంది. తద్వారా డెస్క్‌టాప్‌ యూజర్లు టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ ఎనేబుల్‌, డిసేబుల్‌ చేయాల్సి ఉంటుంది.

WhatsApp
WhatsApp

WhatsApp Two step verification: ప్రముఖ మెసేంజర్‌ వాట్సాప్‌ త్వరలో డెస్క్‌టాప్‌ యాప్, వెబ్‌ వెర్షన్‌లోనూ రెండు దశల ధ్రువీకరణను (టూ స్టెప్ వెరిఫికేషన్) తీసుకురానుంది. ఈ మేరకు రాబోయే అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ తీసుకురానున్నట్లు సమాచారం. తద్వారా డెస్క్‌టాప్‌ యూజర్లు టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ఎనేబుల్‌, డిసేబుల్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాట్సాప్‌ పిన్‌ మర్చిపోతే ఈ-మెయిల్‌ ద్వారా రీసెట్‌ చేసుకోవచ్చు. కాగా, ఇప్పటికే మొబైల్ యాప్ వెర్షన్‌లో టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ అందుబాటులో ఉంది.

మరోవైపు సైబర్‌ నేరగాళ్ల నుంచి యూజర్ల ఖాతాలకు రక్షణ కల్పించడానికి గూగుల్ కూడా ఈ మధ్యే టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్ ఫోన్ లేదా ఈ-మెయిల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని టైప్ చేస్తేనే ఖాతా ఓపెన్ అవుతుందని గూగుల్‌ తెలిపింది.

ఇదిలా ఉంటే.. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌ మొబైల్‌కు వాట్సాప్‌ చాట్‌ బదిలీ చేసేలా మరో కొత్త ఫీచర్‌పై మెటా పనిచేస్తోంది. కేబుల్‌ లేదా వైఫై కనెక్షన్‌ను ఉపయోగించి చాట్‌ బదిలీ చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. పలువురు బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి ఉండగా, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

ఇదీ చూడండి:త్వరలోనే టాటా గ్రూప్​ చేతికి ఎయిర్​ఇండియా!

Last Updated : Jan 25, 2022, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details