ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున చాలా దేశాల్లో లాక్డౌన్ విధించారు. ఈ కారణంగా కోట్లాది మంది ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఇళ్లలో ఉంటున్నవారు తమకు ఇష్టమైన వారితో మాట్లాడేందుకు గ్రూప్ వీడియో కాల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే పరిమిత స్థాయిలో ఉన్న ఈ అవకాశాన్ని వాట్సాప్ ఆప్డేట్ చేయనుంది. ఇకపై వాట్సాప్ వేదికగా ఒకేసారి 8 మందితో వీడియో, ఆడియో కాల్ మాట్లాడే అవకాశాన్ని కల్పించనుంది.
అప్డేట్ చేయనుందిలా
ఇప్పటివరకు వాట్సాప్ ద్వారా నలుగురు మాత్రమే వీడియో కాల్ మాట్లాడేవారు. ఇప్పుడు ఆ పరిధిని ఎనిమిదికి పెంచనుందీ సంస్థ. అయితే ఇందుకోసం టెస్ట్‌ఫ్లైట్ నుంచి 2.20.50.25 ఐఓఎస్ బీటా అప్డేట్ను పొందవచ్చు. లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2.20.133 బీటాను పొందాలి.