ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్.. తన ప్రైవసీ పాలసీపై వెనక్కు తగ్గింది. ఇదివరకు మే 15 లోపు నూతన గోప్యతా విధానాన్ని అంగీకరించాలని ఖాతాదారులకు సూచించిన వాట్సాప్... అలా చేయడం తప్పనిసరి కాదని తాజాగా స్పష్టం చేసింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించని వారి అకౌంట్లను తొలగించబోమని వెల్లడించింది.
'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్! - whats app latest news
17:41 May 07
'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్!
" ఈ అప్డేట్ వల్ల మే 15 తర్వాత ఏ ఒక్కరి ఖాతాను డిలీట్ చేయం. భారత్‌లోని ఖాతాదారులకు మునుపటి లాగే వాట్సాప్ సేవలు కొనసాగుతాయి. రాబోయే వారాల్లో మా నియమ నిబంధనలను అంగీకరించని ఖాతాదారులకు రిమైండర్లు పంపుతాం."
-- వాట్సాప్ సంస్థ అధికార ప్రతినిధి
అయితే.. వాట్సాప్ తమ నూతన ప్రైవసీ విధానాన్ని ఎందుకు రద్దు చేసుకుందో మాత్రం వెల్లడించలేదు. వాట్సాప్ సమాచారాచాన్ని.. ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని గతంలో ఆ సంస్థ ప్రకటించగా.. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.