తెలంగాణ

telangana

ETV Bharat / business

వెనక్కి తగ్గిన వాట్సాప్​- ప్రైవసీ అప్​డేట్​ వాయిదా - WhatsApp privacy

ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌ను మరికొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది వాట్సాప్​. అప్‌డేట్‌పై వస్తున్న తప్పుడు వార్తలతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 8న ఎవరి ఖాతాలు నిలిపివేయడం లేదా తొలగించడం జరగదని స్పష్టం చేసింది.

WhatsApp postpones privacy update plan amid rising concerns
వెనక్కి తగ్గిన వాట్సాప్​- ప్రైవసీ అప్డేట్​ వాయిదా

By

Published : Jan 16, 2021, 5:33 AM IST

Updated : Jan 16, 2021, 7:15 AM IST

కొత్త ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌పై అనేక అభ్యంతరాలు వ్యక్తమైన తరుణంలో వాట్సాప్ కాస్త వెనక్కి తగ్గింది. ఈ అప్‌డేట్‌ను మరికొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వినియోగదారులకు పాలసీపై సమీక్షించుకునేందుకు మరింత సమయం లభిస్తుందని వాట్సాప్‌ చెప్పుకొచ్చింది. తమ పాలసీ అప్‌డేట్‌పై వస్తున్న తప్పుడు వార్తలతో వినియోగదారుల్లో ఆందోళన ఉందని, అందుకే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ముందుగా నిర్ణయించిన విధంగా ఫిబ్రవరి 8న కాకుండా పాలసీని మే 15నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు వాట్సాప్​ వెల్లడించింది. ఫిబ్రవరి 8న ఎవరి ఖాతాలు నిలిపివేయడం లేదా తొలగించడం జరగదని ప్రకటించింది. తమ యాప్‌లో గోప్యత, భద్రత పనిచేసే విధానంపై వచ్చిన అపోహలను నివృత్తి చేసేందుకు పనిచేస్తామని తెలిపింది.

ఇదీ చూడండి: టెలిగ్రామ్@500 మిలియన్​ డౌన్​లోడ్లు

Last Updated : Jan 16, 2021, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details