తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్​ కొత్త ఫీచర్: మెసేజ్​లు వాటంతటవే తొలగిపోతాయట! - వాట్సాప్​ కొత్త వెర్షన్​

వందల కొలదీ వచ్చే వాట్సాప్​ సందేశాలతో విసిగిపోతున్నారా? మెమోరీ ఫుల్​ అయిపోతోందని చింతిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. నిత్యం వచ్చే వాట్సాప్​ సందేశాలను ఆటోమేటిక్​గా డిలీట్​ చేసుకునే సరికొత్త ఫీచర్​ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్​ సంస్థ.

WhatsApp New Feature: Messages are automatically deleted
వాట్సాప్​ కొత్త ఫీచర్: మెసేజ్​లు వాటంతటవే తొలగిపోతాయట

By

Published : Mar 16, 2020, 4:58 AM IST

Updated : Mar 16, 2020, 6:12 AM IST

నిత్యం వచ్చే వాట్సాప్​ సందేశాలతో ఫోన్​ మెమోరీ నిండిపోతోందని ఆందోళన చెందుతున్నారా? ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. సందేశాలు సమయానుకూలంగా ఎప్పటికప్పుడు వాటంతటవే తొలగిపోయే వెసులుబాటుపై వాట్సాప్​ సంస్థ దృష్టి సారించింది.

ఒక్క ఆప్షన్​తో..

అయితే మనం తొలగించుకోవాలనుకున్న సందేశాలకు నిర్ణీత గడువును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక గంట, ఒక రోజు, వారం, నెల, సంవత్సరం ఇలా తొలగింపు వ్యవధిని ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతానికి బీటా వెర్షన్​లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి:వాట్సాప్​ రికార్డు: ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు

Last Updated : Mar 16, 2020, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details