ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ 'పెగాసస్' దాడులపై వాట్సాప్ 'విచారం' వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. సమస్య పరిష్కారానికి అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
పెగాసస్ దాడులను అరికట్టేందుకు వాట్సాప్ తగిన చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించింది.
గూఢచర్యం..
ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్.. గత నెలలో పెగాసస్ స్పైవేర్ ద్వారా గుర్తు తెలియని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారాన్ని తస్కరించారని పేర్కొంది.
స్నూపింగ్ సమస్యపై చర్చ...
కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సమావేశంలో వాట్సాప్ స్నూపింగ్ సమస్య చర్చకు వచ్చింది. ఫలితంగా పార్లమెంట్లో ఈ సమస్యపై వాడివేడి చర్చ సాగింది.
దీనిపై లోక్‌సభలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ భారతీయుల ఫోన్లను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడులకు పాల్పడుతోందని వివరించారు. ఈ విషయంపై ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్... వాట్సాప్‌ను హెచ్చరించిందని వెల్లడించారు.
భారత్ హెచ్చరిక
వాట్సాప్ ద్వారా ప్రమాదకర సైబర్ దాడులు జరుగుతున్నట్లు భారత సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్‌టీ-ఇన్ హెచ్చరించింది. ఈ సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు వినియోగదారులు తమ వాట్సాప్‌ను తాజా వర్షన్‌లోకి అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్‌టీ-ఇన్ సూచించింది.
ఇదీ చూడండి:చిట్‌ఫండ్ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం