వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్ణీత సమయం తరువాత మనం పంపిన, మన కొచ్చిన సందేశాలు వాటికవే అదృశ్యం కావడం దీని ప్రత్యేకత.
బీటా వెర్షన్లకే పరిమితం...
వాట్సాప్... ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్‌లో బీటా వెర్షన్ 2.20.10.23 అప్డేట్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
గ్రూప్ చాట్ల వరకే...
ప్రస్తుతం 'డిలీట్ మెసేజ్' సౌలభ్యం గ్రూప్ చాట్లకే పరిమితం.. వీటిలోనూ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు మాత్రమే ఈ సందేశాలు పంపించగలరు. అయితే త్వరలో వ్యక్తిగత చాట్‌లకూ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
'సందేశాలను తొలగించు'
ఇంతకు ముందు 'అదృశ్యమయ్యే సందేశాలు'గా పేర్కొన్న వీటిని ఇప్పుడు 'డిలీట్ మెసేజ్' అంటున్నారు. డబ్ల్యూఏ బీటా ఇన్ఫో ప్రకారం, వాట్సాప్ 'సందేశం' ఎంత సమయం కనిపిస్తోందో వినియోగదారులు ముందే చూడగలరు.
ఎంతో ఉపయోగం..
ఉదాహరణకు.. మీ గ్రూపులో ఒకరి పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలపాలనుకుందాం. అందరూ సందేశాలు పంపిస్తారు. తరువాతి రోజు వాటి అవసరం ఉండదు. కనుక నిర్ణీత సమయం తరువాత అదృశ్యం అయ్యేలా మన సందేశాలు పంపించవచ్చు.
మరిన్ని ఫీచర్లు
డార్క్ మోడ్, ఫింగర్ ప్రింట్ లాక్ సహా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ కృషి చేస్తోంది. వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు వాట్సాప్... ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఇప్పటికే టెలిగ్రామ్, హైక్ వంటి పోటీ యాప్‌లు ఈ దిశగా అడుగులు వేయడం గమనార్హం.
ఇదీ చూడండి:జనవరి 1 నుంచి ఎమ్‌డీఆర్ చెల్లింపులు ఉండవ్!