తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్​: ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ల్లోనూ 'డార్క్​ మోడ్'!

వాట్సాప్​ త్వరలోనే ఆండ్రాయిడ్​, ఐఓఎస్ ప్లాట్​ఫాంలతోపాటు వెబ్​లోనూ డార్క్​ మోడ్ ఫీచర్​ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అలాగే డార్క్​ మోడ్ ఫీచర్​ ఎమోజీలు, స్టిక్కర్లలతో సహా మరెన్నో గణనీయమైన మార్పులను తీసుకురానుంది. అయితే ఎప్పుడు ఈ ఫీచర్లను తీసుకొస్తుందో మాత్రం వాట్సాప్​ అధికారికంగా వెల్లడించలేదు.

WhatsApp Dark mode
వాట్సాప్ డార్క్​ మోడ్​: అప్​డేట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

By

Published : Feb 27, 2020, 6:30 AM IST

Updated : Mar 2, 2020, 5:15 PM IST

వాట్సాప్​ త్వరలో వెబ్​తో పాటు ఆండ్రాయిడ్​, ఐఓఎస్ ప్లాట్​ఫామ్​ల్లో డార్క్​ మోడ్ ఫీచర్​ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే దీనిపై వాట్సాప్​ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రపంచంలో అత్యంత ప్రియమైన మెసేజింగ్ వేదికల్లో ఒకటైన వాట్సాప్ ఇటీవలే 2 బిలియన్ యాక్టివ్ యూజర్​లను దాటింది. ఫేస్​బుక్ యాజమాన్యంలోని ఈ అనువర్తనం సరికొత్త నవీకరణలు, గోప్యతా ప్రమాణాలతో వినియోగదారులకు అద్భుతమైన బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తోంది.

వెబ్​లోనూ

డబ్ల్యూఏబీటెల్ఇన్ఫో బ్లాగ్​ ప్రకారం, వాట్సాప్​ చాలా కాలంగా ఆండ్రాయిడ్​, ఐఓఎస్ స్మార్ట్​ఫోన్లలో డార్క్​ మోడ్ ఫీచర్లను పరీక్షిస్తోంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా మొబైల్, డెస్క్​టాప్​ ప్లాట్​ఫాం రెండింటిలోనూ ఈ ఫీచర్​ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

అలాగే వాట్సాప్ డార్క్​ మోడ్ ఫీచర్ ....​ ఎమోజీలు, స్టిక్కర్లలతో సహా మరెన్నో గణనీయమైన మార్పులను తీసుకువస్తుందని ఈ బ్లాగ్​ పేర్కొంది.

బగ్​ పరిష్కారమైంది...!

ఇటీవల వాట్సాప్​ తీసుకొచ్చిన ఓ అప్​డేట్​లో బగ్​ కనిపించింది. వాట్సాప్ గ్రూప్​ చాట్స్ ఆహ్వాన లింక్ గూగుల్ సూచికను చూపించింది. ఫలితంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాట్సాప్​ ఈ బగ్​ను పరిష్కరించింది. గూగుల్ సెర్చ్​లోని వాట్సాప్​ గ్రూప్ చాట్​ ఆహ్వాన లింక్​లను పూర్తిగా తొలగించింది.

త్వరలో!

వాట్సాప్...​ డార్క్​మోడ్ ఫీచర్​ను ఎప్పుడు తీసుకొస్తుందో మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్​ 2.20.31 బిల్డ్​లో కొత్త ముదురు రంగులను ఉపయోగించడం మాత్రం కనిపించింది. దీని అర్థం డార్క్​మోడ్​ ఫీచర్​ నలుపు​ కాకుండా ఇతర ముదురు రంగులను కలిగి ఉంటుంది.

ఓ మార్గం ఉంది..!

వినియోగదారులు తమ వాట్సాప్ వెబ్​లో డార్క్​ థీమ్​ లాంటి మోడ్​ను ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే... వారికో మార్గం ఉంది. ఇందు కోసం ఎక్స్​టర్నల్​ క్రోమ్​ ఎక్స్​టెన్షన్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి. తరువాత వాట్సాప్ డార్క్​మోడ్​ కోసం అందించే సూచనలు అనుసరించాలి. వాట్సాప్ డార్క్​మోడ్​ వినియోగదారులకు మొబైల్, డెస్క్​టాప్ ప్లాట్​ఫాంల్లో అద్భుతమైన బ్రౌజింగ్ అనుభవాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదీ చూడండి:ఆక్స్​ఫర్డ్​ వేదికగా ఒక్క చోట చేరిన మలాలా, థన్​బర్గ్​

Last Updated : Mar 2, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details