ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. పేమెంట్ సర్వీస్‌లకు మరిన్ని హంగులు దిద్దింది. 'పేమెంట్స్ బ్యాగ్రౌండ్' పేరుతో నగదు బదిలీతో పాటు ఫీలింగ్స్ కూడా తెలిపేలా (పేమెంట్ ఉద్దేశం అర్థమయ్యేలా).. వివిధ రకాల థీమ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో కలిసి సంయుక్తంగా ఈ డిజైన్లను రూపొందించినట్లు వాట్సాప్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 227కు పైగా బ్యాంకుల కస్టమర్లు వాట్సాప్ పేమెంట్ సేవలను వినియోగించుకునే వీలుందని వివరించింది.
'ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను, ఆలోచనలు.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు వాట్సాప్ ఓ సురక్షితమైన వేదిక. పేమెంట్స్ విషయంలో.. ఇకపై డొనేషన్, సెలెబ్రేషన్, ఎఫెక్షన్, ఫన్.. వంటి థీమ్స్‌ను జోడించి మరింత ఆకర్షణీయంగా లావాదేవీలు జరపొచ్చు. యూజర్లు అవసరం అనుకుంటేనే ఈ ఫీచర్ వాడుకోవచ్చు' అని వాట్సాప్ ఇండియా పేర్కొంది.