చిన్నపిల్లలకు క్షౌరం చేయించాలంటే వారి తల్లిదండ్రులు చిన్నపాటి యుద్ధమే చేయాలి. వారిని బుజ్జగించాలి, బతిమలాడాలి... ఆపై ఏం కావాలన్నా తీసుకురావాలి. అన్నీ చేసినా... తీరా క్షవరం చేసే సమయంలో ఏడుపు అందుకుంటారు. కానీ ఓ బుడతడు మాత్రం అందుకు భిన్నం. తల్లి ఒడిలో కూర్చొని ట్రిమ్మర్‌తో క్షవరం చేస్తుంటే పడిపడి నవ్వుతున్నాడు.
మహేంద్రుడు మెచ్చిన 'నవ్వుల పిడుగు' - hair cutting
ఆ బుడతడిని చూస్తే మీ మోములో చిరునవ్వు వికసిస్తుంది. మీ బాధల్ని క్షణకాలం మరిచిపోయి హాయిగా అనిపిస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆ వీడియోకు విపరీతమైన స్పందన వస్తోంది.
ఈ బుడతడ్ని చూస్తే... చిరునవ్వు వికసిస్తుంది
ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీనికి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా స్పందన వస్తోంది.
"ఏదైనా బాధ కలిగించే వార్త విన్నప్పుడు ఈ వీడియోను చూస్తే వారు కచ్చితంగా నవ్వుతారు."- ఆనంద్ మహీంద్ర, మహీంద్ర గ్రూప్ ఛైర్మన్