తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ పెట్టుబడి ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందో తెలుసా? - రూల్​ ఆఫ్​ 72 అంటే ఏమిటి

పెట్టుబడులు పెట్టేముందు అందరికీ వాటి నుంచి వచ్చే ఆదాయంపై చాలా అంచనాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది పెట్టుబడి ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుంది అని. అయితే వార్షిక రాబడి ఆధారంగా ఆ సమయాన్ని లెక్కించొచ్చు. అదెలా అంటే..

What Is the Rule of 72
పెట్టుబడి రెట్టింపు అయ్యేందుకు

By

Published : Feb 27, 2020, 12:47 PM IST

Updated : Mar 2, 2020, 5:56 PM IST

ఫిక్స్​డ్​ డిపాజిట్లు, పొదుపు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీలు ఇలా పెట్టుబడులకు అనేక సాధనాలున్నాయి. వీటితో వార్షికంగా వచ్చే రాబడిపై అంచనాలు ఉంటాయి. అయితే పెట్టిన పెట్టుబడి ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అన్నది చాలా మందికి ఉండే సందేహం. పెట్టుబడి రెట్టింపవ్వడానికి పట్టే సంవత్సరాలు తెలుసుకునేందుకు ఓ ఫార్ములా ఉంది. అదే రూల్​ ఆఫ్​ 72.

ఫార్ములా ప్రయోగించడం ఎలా..

ఉదాహరణకు మీరు 12 శాతం రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టారనుకోండి. అప్పుడు 72ను 12 శాతంతో భాగించగా వచ్చిన ఫలితమే మీ పెట్టుబడి రెట్టింపయ్యే సమయం (సంవత్సరాల్లో).

ఫార్ములా ప్రకారం:72/12=6

అంటే మీరు 12 శాతం రాబడినిచ్చే సాధనంలో పెట్టుపడి పెడితే అది 6 ఏళ్లలో రెట్టింపు అవుతుంది.

మూడు, నాలుగు రెట్లు అయ్యేందుకు?

మీ పెట్టుబడి మూడు రెట్లు పెరగటానికి పట్టే సంవత్సరాలను తెలుసుకునేందుకు 114తో భాగించాలి. అదే నాలుగు రెట్లు అయ్యేందుకు పట్టే సంవత్సరాలను తెలుసుకునేందుకు 144తో భాగించాలి.

ఈ ఫార్ములాల ప్రకారం 12 శాతం రాబడితో.. మీ పెట్టుబడి మూడు రెట్లు అయ్యేందుకు (114/12)= 9.5 సంవత్సరాలు పడుతుంది. నాలుగు రెట్లు అయ్యేందుకు (144/12)= 12 ఏళ్లు సమయం కావాలి.

ఇదీ చూడండి:గంటకు రూ.7 కోట్లు.. ప్రపంచ కుబేరుడిగా ముకేశ్​!

Last Updated : Mar 2, 2020, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details