పెట్టుబడులు పెట్టేందుకు చాలా సాధనాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్, ప్రత్యక్ష ఈక్విటీ, ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్స్, బంగారం, స్థిరాస్తి వంటివి ఎక్కువ ప్రాచూర్యంలో ఉన్నాయి. స్మాల్ కేస్ అనేది ఈ మధ్య పాపులారిటీ పొందుతోంది. ముఖ్యంగా ప్రత్యక్ష ఈక్విటీ పెట్టే వారి మధ్యలో వీటికి సంబంధించిన చర్చ నడుస్తోంది.
మ్యూచువల్ ఫండ్ల అంటే కొంత మొత్తంలో యూనిట్లు మన ఖాతాలో జమ అవుతాయి. కానీ పెట్టుబడి చేసే కంపెనీల స్టాక్స్ మనకు ప్రత్యక్షంగా అందవు. స్మాల్ కేస్ కూడా మ్యూచువల్ ఫండ్ లాంటిదే కానీ ఇందులో స్టాక్స్ పెట్టుబడిదారులకు అందుతాయి.
స్మాల్ కేస్ ఏమిటి?
స్మాల్ కేస్ లో సాధారణంగా ఒక నేపథ్యంతో పెట్టుబడి ఉంటుంది. అంటే…. ఐటీ, రవాణా, అందుబాటు ధరలో ఇళ్లు, లోహాలు, మౌలిక సదుపాయాలు, డివిడెంట్ తదితర ఇతివృత్తాలతో పెట్టుబడులు పెట్టొచ్చు. 250 స్మాల్ కేస్ లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిని తయారు చేసేందుకు.. పోర్ట్ ఫోలియో మేనేజర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు.
స్మాల్ కేస్ అనేది ఒక వెబ్ సైట్. ఈ కంపెనీని 2015లో ముగ్గురు ఐఐటీ పూర్వ విద్యార్థులు బెంగళూరులో ప్రారంభించారు. 2016 నుంచి దీని కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా పెట్టుబడి దారులను పోర్ట్ ఫోలియో మేనేజర్లను అనుసంధానం చేస్తుంది. వీళ్లు పరిశోధన చేసి వారి స్మాల్ క్యాప్ స్టాక్ ల బాస్కెట్ తయారు చేస్తారు. బ్రోకర్ల ద్వారా దానికనుగుణంగా పెట్టుబడి చేస్తారు.