తెలంగాణ

telangana

ETV Bharat / business

భద్రతతో పాటు ఆదాయానిచ్చే ఎస్​బీఐ గోల్డ్ స్కీం - ఎస్​బీఐ గోల్డ్ స్కీంలో కనీస డిపాజిట్​

నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని డిపాజిట్​ చేసి ఆదాయం గడించేలా.. ఎస్​బీఐ ఆర్-జీడీఎస్​ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం ఎలా పని చేస్తుంది. వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి. ఈ పథకంలో డిపాజిట్​కు అర్హతలు ఏమిటి? ఎంత మొత్తం బంగారాన్ని డిపాజిట్​ చేయొచ్చు? అనే పూర్తి వివరాలు మీ కోసం.

SBI Gold Scheme
ఎస్​బీఐ గోల్డ్​ స్కీం

By

Published : Oct 6, 2021, 1:45 PM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పున‌రుద్ధ‌రించిన గోల్డ్ డిపాజిట్ స్కీం (ఆర్‌-జీడీఎస్‌) 3 ర‌కాల డిపాజిట్ ప‌థ‌కాల‌ను అందిస్తుంది. ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ ద‌గ్గ‌రున్న ఉప‌యోగం లేని బంగారాన్ని 'ఆర్‌-జీడీఎస్‌' కింద డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఇది వారికి భ‌ద్ర‌త‌, వ‌డ్డీ ఆదాయాలు అందిస్తుంది. ఎస్‌బీఐ ప్ర‌కారం, పున‌రుద్ధ‌రించిన గోల్డ్ డిపాజిట్ స్కీం (ఆర్‌-జీడీఎస్‌) బంగారంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ లక్షణాలను క‌లిగి ఉంటుంది.

ఈ డిపాజిట్​కు ఎవరు అర్హులు?

సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కంపెనీలు, ధార్మిక సంస్థ‌లు లేదా సెంట్ర‌ల్ యాజ‌మాన్యంలోని ఇత‌ర సంస్థ‌లు, వ్య‌క్తులు, యాజ‌మాన్యాలు, భాగ‌స్వామ్య సంస్థ‌లు, హెచ్‌యుఎఫ్‌లు (హిందూ అవిభ‌క్త కుటుంబం), మ్యూచువ‌ల్ ఫండ్‌లు/ ఎక్స్ఛేంజ్​-ట్రేడెడ్ ఫండ్స్ వంటి వ‌ర్గాలు, నివాస భార‌తీయులు, కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ ఎస్‌బీఐ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి అర్హులు.

ఎంత డిపాజిట్​ చేయాలి?

ఎవ‌రైనా క‌నీసం 10 గ్రాముల ముడి బంగారాన్ని (నాణేలు, న‌గ‌లు, రాళ్లు మిన‌హాయించి) డిపాజిట్ చేయాలి. డిపాజిట్‌ల‌కు గ‌రిష్ట ప‌రిమితి లేదు.

డిపాజిట్ల ర‌కాలు:

  • ఎస్‌బీఐ గోల్డ్ డిపాజిట్ స్కీం (ఆర్‌-జీడీఎస్‌) 3 ర‌కాల డిపాజిట్ల‌ను అందిస్తుంది.
  • స్వ‌ల్ప‌కాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్‌టీబీడీ) కాల‌వ్య‌వ‌ధి 1 నుండి 3 సంవ‌త్స‌రాలు.
  • మ‌ధ్య‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎంటీజీడీ) కాల‌వ్య‌వ‌ధి 5-7 సంవ‌త్స‌రాలు.
  • దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎల్‌టీజీడీ) కాల‌వ్య‌వ‌ధి 12-15 సంవ‌త్స‌రాలు.

వ‌డ్డీ రేట్లు:

స్వ‌ల్ప‌కాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్‌టీబీడీ)కి ఒక సంవ‌త్స‌రానికి 0.50%. 1 సంవ‌త్స‌రం నుండి 2 సంవ‌త్స‌రాల వ‌ర‌కు డిపాజిట్ల‌కు 0.55%.

2 సంవ‌త్స‌రాల నుండి 3 సంవ‌త్స‌రాల వ‌ర‌కు డిపాజిట్ల‌కు 0.60% చెల్లిస్తారు.

మ‌ధ్య‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్‌పై వ‌డ్డీ రేటు ఒక సంవ‌త్స‌రానికి 2.25%. దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్‌పై వ‌డ్డీ రేటు ఒక సంవ‌త్స‌రానికి 2.50%గా ఉంది.

తిరిగి చెల్లింపు:

స్వ‌ల్ప‌కాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్‌టీబీడీ) మెచ్యూరిటీ తేది నాటికి బంగారం లేదా దానికి స‌మాన‌మైన న‌గ‌దును బ్యాంక్‌ చెల్లిస్తుంది. మ‌ధ్య‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్, దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎమ్‌టీజీడీ అండ్ ఎల్‌టీజీడీ) మెచ్యూరిటీ తేది నాటికి ప్ర‌స్తుత ధ‌ర ప్ర‌కారం బంగారం విలువ‌కు స‌మాన‌మైన విలువ‌ను క‌ట్టి రూపాయ‌ల‌లో అందిస్తారు. 0.20% ప్రాసెసింగ్ ఛార్జీలు విధించ‌బ‌డ‌తాయి.

ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ:

ఎస్‌టీబీడీ:ఒక సంవ‌త్స‌రం లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి త‌ర్వాత వ‌ర్తించే వ‌డ్డీ రేటుపై పెనాల్టీతో అనుమ‌తించ‌బ‌డుతుంది.

ఎంటీజీడీ:వ‌డ్డీపై పెనాల్టీతో 3 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎప్పుడైనా ఉప‌సంహ‌రించుకోవ‌డానికి అనుమ‌తించ‌బ‌డుతుంది.

ఎల్‌టీజీడీ:వ‌డ్డీపై జ‌రిమానాతో 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎప్పుడైనా ఉప‌సంహ‌రించుకోవ‌డానికి అనుమ‌తించ‌బ‌డుతుంది.

ఇదీ చదవండి:Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details