వినియోగ ఆధారిత బీమా(పే ఆజ్ యూ డ్రైవ్ పాలసీ) అనేది సమగ్ర, ఓన్ డ్యామేజీ థర్డ్ పార్టీ వాహన బీమా పాలసీ. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) రెగ్యులేటరీ సాండ్ బాక్స్ లో భాగంగా దీనిని సంవత్సరం పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.
ఐఆర్డీఏఐ సమక్షంలో నూతన ఆవిష్కరణకర్తలు, కంపెనీలు ప్రత్యక్ష ప్రయోగాలు చేసుకునేందుకు ఉద్దేశించినదే ఈ రెగ్యులేటరీ స్యాండ్ బాక్స్.
ఉదాహరణకు కంపెనీలు 10 వేల వినియోగ ఆధారిత పాలసీలను అందించేందుకు అనుమతి లభిస్తే.. ఆ మేరకు పాలసీలను విక్రయించవచ్చు. దీనితో ఆ పాలసీలకు సంబంధించి పలు అంశాలను పరిశీలించి, రెగ్యులర్ పాలసీగా దానిని అందించవచ్చా లేదా అనే విషయంపై ఒక నిర్ణయానికి వస్తాయి.
ప్రయాణ దూరం ఆధారంగా పాలసీ ప్రీమియం
వినియోగ ఆధారిత పాలసీలో వినియోగదారుడు పాలసీ తీసుకున్న కాలానికి ప్రయాణించే దూరాన్ని అంచనా వేసుకుని దాని ప్రకారం శ్లాబ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణ పాలసీలో వాహనం మోడల్, తీసుకుని ఎంతకాలం అయ్యింది తదితర అంశాల ఆధారంగా ఒక సంవత్సరానికి బీమా ప్రీమియం ఒకే సారి చెల్లించాల్సి ఉంటుంది.
డిస్కౌంట్..
ఈ వినియోగ ఆధారిత పాలసీలో ఓన్ డ్యామేజీ బీమా పైన కంపెనీలు 5 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. తక్కువ దూరం ప్రయాణించిన వారికి ఎక్కువ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. వినియోగ ఆధారిత బీమా పాలసీలో కిలోమీటర్ల ప్రకారం విభజించిన శ్లాబ్‌ను వినియోగదారుడు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ శ్లాబులు కంపెనీ ఆధారంగా 2వేల కిలోమీటర్ల నుంచి 20వేల కిలోమీటర్ల స్థాయిలో ఉంటాయి.
దీనితో పాటు యాడ్ఆన్లు ఏమైనా ఉంటే వాటన్నింటికి కలుపుకుని ఓన్ డ్యామేజీ బీమా ప్రీమియంను నిర్ణయిస్తారు. అయితే థర్డ్ పార్టీ ఛార్జీలు అదనంగా ఉంటాయి.
ప్లోటర్ పాలసీ సదుపాయం..