'అమెజాన్ ప్రైమ్ వీడియో'పై తమ పెట్టుబడులు రెట్టింపు చేయనున్నట్లు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ తెలిపారు. మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో తమ కంపెనీ స్ట్రీమింగ్ సర్వీస్ చాలా మెరుగ్గా పనిచేస్తుండడమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు.
భారత్‌లో పర్యటిస్తున్న బెజోస్ ముంబయిలో గురువారం రాత్రి బాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్, దర్శకుడు జోయా అక్తర్‌లతో మాట్లాడుతూ.. తన భారత పర్యటన అనుభవాలను పంచుకున్నారు. పుస్తకాల విక్రయంతో మొదలైన అమెజాన్ ప్రస్థానాన్ని బెజోస్ వివరించారు.
"ప్రైమ్ వీడియో ప్రపంచమంతటా బాగానే ఉంది. జపాన్, జర్మనీ, అమెరికాలో బాగా పనిచేస్తోంది. కానీ మిగతా వాటితో పోల్చితే భారత్‌లోనే బాగా మెరుగ్గా ఉంది. వ్యాపారపరంగా చూస్తే ఇది చాలా బాగుంది. అందుకే భారత్‌లో ప్రైమ్ వీడియోపై మా పెట్టుబడులు రెట్టింపు చేయాలని నిర్ణయించాం."
- బెజోస్, అమెజాన్ సీఈఓ
టీవీతో స్వర్ణయుగం