కొవిషీల్డ్ కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు పొందేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. రెండు వారాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నారు.
వ్యాక్సిన్ డోసుల కొనుగోళ్లపై ప్రభుత్వంతో ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదన్నారు పూనావాలా. అయితే 2021 జులై నాటికి కనీసం 300-400 మిలియన్ల టీకా డోసులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.
తొలుత ఈ టీకాను భారత్లో సరఫరా చేస్తామని.. అనంతరం ఆఫ్రికాలో పంపిణీపై ఆలోచిస్తామని వెల్లడించారు సీఐఐ సీఈఓ.