వివిధ దేశాల్లో.. పెట్టుబడులు, వ్యాపార అనుకూలతలను తెలిపే 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నివేదికను ప్రచురించడం నిలిపివేయాలని వరల్డ్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికలో ఇచ్చే ర్యాంకింగ్స్‌ను తారుమారు చేసేలా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలే ఇందుకు కారణంగా తెలిసింది.
ముఖ్యంగా 2017లో చైనా ర్యాంక్‌ను పెంచాలని.. కొంత మంది ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని ఒత్తిడి చేసినట్లు ఇటీవల ఓ కథనం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలు వరల్డ్ బ్యాంక్ దృష్టికి వెళ్లాయి.