ఉపయోగించిన (సెకండ్ హ్యాండ్) కార్లకు రుణాలు (used car loan) ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. భారత్‌లో మధ్యతరగతి ప్రజలు అధిక శాతంలో ఉన్నారు. అందరూ డైరక్ట్‌గా కంపెనీ నుంచి షోరూమ్‌లకు వచ్చే కార్లను కొనేటంతట స్థోమత ఉండకపోవచ్చు. కానీ తగిన బడ్జెట్‌లో తమకు నచ్చిన కంపెనీ కారును (budget used cars) సొంతం చేసుకోవాలని ఆశ మాత్రం ఉంటుంది. అలాగే స్వల్ప కాలానికి కారుని ఉపయోగించాలని అనుకునే వారికి సెకండ్ హ్యాండ్‌కార్ల మార్కెట్లో కారు కొనుగోలు (second hand cars) మంచి అవకాశమనే చెప్పాలి. ఇటువంటి కార్లు చౌకగా లభిస్తాయని పేరు ఇప్పటికే ఉంది. వినియోగదారులు తమ బడ్జెట్‌లో దొరికే కారులో షికారు చేయోచ్చు.
భారత్‌లో ఉపయోగించిన (సెకండ్ హ్యాండ్) కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా ప్రస్తుత కోవిడ్ పరిణామాలతో చాలామంది ప్రజా రవాణా కంటే ప్రైవేట్ రవాణాను కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు. చాలా బ్యాంకులు ఆకర్షనీయమైన ఒప్పందాలు, పోటీ వడ్డీ రేట్లను (used car loan interest rate) అందిస్తుండడంతో, ఉపయోగించిన కారు కొనడం సౌకర్యవంతంగా, సులభంగా మారింది. కారు కొనడం ఎప్పుడూ ఉత్సాహకరంగా ఉంటుంది. చౌకగా లభిస్తే ఇంకా ఆనందం మరి. దీనికి కాస్త పరిశోధనా, ప్రణాళిక చాలా అవసరం. మీరు కారు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు, గరిష్ట ఫీచర్లతో టాప్-ఎండ్ మోడల్ కోసం చూడడమే కాకుండా మీ బడ్జెట్‌కు (budget car finder) సరిపోయే కారును తీసుకోవాలి.
ఒక్కో బ్యాంకులో ఒక్కోలా...
ఉదాహరణకు, కొన్ని బ్యాంకులు 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మోడల్ కార్లకు మాత్రమే రుణాలు ఇస్తారు. మరికొందరు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మోడల్ కార్లకు రుణం ఇవ్వవచ్చు. మీకు ఆమోదించిన రుణం, కారు విలువలో 75% - 85% వరకు ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. ఉపయోగించిన కార్ల రుణానికి వడ్డీ రేటు 11% - 16% మధ్య బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. తిరిగి రుణం చెల్లించే కాల వ్యవధి (car loan repayment period) కొన్ని బ్యాంకులు 7 సంవత్సరాల వరకు కూడా ఇస్తున్నాయి. ఇది కాకుండా మీరు కొంత మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. సాధారణంగా ఉపయోగించిన కారు రుణాల వడ్డీ రేట్లు కొత్త కారు రుణాల వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా ఉంటాయి.