తెలంగాణ

telangana

ETV Bharat / business

వాల్​మార్ట్​ బంపర్ ఆఫర్​.. 1.5లక్షల మందికి ఉద్యోగాలు - వాల్​మార్ట్​ బంపర్ ఆఫర్​.

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాల్​మార్ట్​ సంస్థ బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. అమెరికాలో కొత్తగా 1,50,000 మందికి వాల్​మార్ట్​లో పనిచేసే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బోనస్​ల రూపంలో 365 మిలియన్​ డాలర్ల(రూ.36.5 కోట్లు)ను చెల్లించనుంది ఈ అమెరికా రిటైల్​ దిగ్గజ సంస్థ.

Walmart to hire 150,000 workers as virus spreads in US
వాల్​మార్ట్​ బంపర్ ఆఫర్​.. 1.5లక్షల మందికి ఉద్యోగాలు

By

Published : Mar 21, 2020, 11:25 AM IST

కరోనా విజృంభిస్తుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన వేళ ఓ తీపి కబురు చెప్పింది వాల్​మార్ట్​ సంస్థ. నిత్యావసర వస్తువుల ఆర్డర్లను అందించేందుకు కొత్తగా 1,50,000 మందిని చేర్చుకోనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా బోనల్​ల రూపంలో 365 మిలియన్​ డాలర్ల(36.5 కోట్ల)ను చెల్లించనుంది ఈ దిగ్గజ సంస్థ.

"వీరిని మొదటగా తాత్కాలికంగా తీసుకొని తర్వాత కాలంలో శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తాం. ఫుల్​టైమ్ ఉద్యోగం చేసిన వారికి 300 డాలర్లు, పార్ట్​టైమ్​ ఉద్యోగులకు 150 డాలర్లను బోనస్​గా అందిస్తాం."

-డౌగ్ మెక్‌మిలన్, వాల్​మార్ట్​ సీఈఓ

బహుమతి ఇవ్వాలని..

సంక్షోభం సమయంలో వినియోగదారులకు అంకితభావంతో సేవ చేసేవారికి బహుమతి చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు వాల్​మార్ట్​ తెలిపింది. తర్వాతి త్రైమాసికం బోనస్​ల చెల్లింపులు కూడా వేగవంతం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు దాదాపు 550 మిలియన్లను కేటాయించింది.

నియామకాలు వేగవంతం

కరోనా మహమ్మారి కారణంగా యూఎస్​ వ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించడమే కాకుండా అనేక సంస్థలు మూతపడ్డాయి. దీనివల్ల దాదాపు 70 వేల మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఈ నియామకాలను వేగవంతం చేయడమే కాకుండా దరఖాస్తు ప్రక్రియ సమయాన్ని రెండు వారాల నుంచి 24 గంటలకు తగ్గిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:విదేశీయుల వీసాల గడువును పొడిగించిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details