తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాపై పోరుకు వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ రూ.46 కోట్ల విరాళం - హుందాయ్‌ వెంటిలేటర్లు

కరోనా వైరస్‌పై పోరులో సహాయం అందించేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. వైద్య సిబ్బంది, పేదల సహాయార్థం రూ.46 కోట్ల విరాళం ప్రకటించాయి వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌లు. మరోవైపు వెంటిలేటర్ల తయారీ కసరత్తును ముమ్మరం చేసింది హుందాయ్ మోటార్స్ ఇండియా.

indian firms giving joining hands to fight against corona
కరోనా పోరుకు కలిసివస్తున్న దిగ్గజాలు

By

Published : Apr 18, 2020, 4:23 PM IST

కరోనాపై పోరులో దిగ్గజ సంస్థల భాగస్వామ్యం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలు సంస్థలు తమ విరాళాలను ప్రకటించగా తాజాగా ఆ జాబితాలో వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ చేరాయి.

వైద్య సిబ్బందికి పీపీఈలు, ఎన్‌95 మాస్క్‌లు సమకూర్చడం సహా ఇతర అవసరాలకు రూ.38.3 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంయుక్తంగా తెలిపాయి. పేదలకు సహాయం చేసేందుకు గూంజ్‌, శ్రీజన్‌ ఎన్‌జీఓలకు రూ.7.7 కోట్లు విరాళం ఇవ్వనున్నట్లు వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ తెలిపింది. ఈ మూడు సంస్థలు కలిపి మొత్తం రూ.46 కోట్లు విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.

వెంటిలేటర్ల తయారీకి హుందాయ్ కసరత్తు..

కరోనా నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ హుందాయ్‌ ఇండియా వెంటిలేటర్ల తయారీకి కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఫ్రెంచ్ సంస్థ ఎయిర్‌ లిక్విడ్ మెడికల్ సిస్టమ్స్‌ (ఎల్‌ఎంఎస్‌)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా తొలి విడతలో 1,000 వెంటిలేటర్లను తయారు చేయనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:కరోనా కాలంలోనూ ఈ వ్యాపారాల్లో జోష్‌

ABOUT THE AUTHOR

...view details