తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్​ను వెంటనే అప్​డేట్​ చేసుకోండి.. లేదంటే అంతే! - వాట్సాప్ వైరస్

వాట్సాప్​ ద్వారా ప్రమాదకర వైరస్​ల దాడి జరుగుతున్నట్లు భారత సైబర్ భద్రతా సంస్థ వినియోగదారులను హెచ్చరించింది. ఎలాంటి అనుమతులు అవసరం లేకుండానే వీడియో ఫైళ్ల రూపంలో సైబర్​ దాడులు జరుగుతున్నట్లు గుర్తించింది. వీటి నుంచి తప్పించుకోవాలంటే వెంటనే లేటెస్ట్​ వర్షన్​కు అప్​గ్రేడ్​ చేసుకోవాలని సూచించింది.

వాట్సాప్​ను వెంటనే అప్​గ్రేడ్ చేసుకోండి.. లేదంటే అంతే!

By

Published : Nov 20, 2019, 3:45 PM IST

వాట్సాప్​ ద్వారా ప్రమాదకర సైబర్​ దాడులు జరిగుతున్నట్లు భారత సైబర్​ భద్రతా సంస్థ హెచ్చరించింది. వినియోగదారుల నుంచి ఎలాంటి అనుమతులు కోరకుండా ఈ వైరస్​లు యాప్​లోకి చొరబడగలవని.. ఎక్కువగా డాట్​(.) ఎంపీఫోర్​ ఫైళ్ల ద్వారా దాడి జరిగే ప్రమాదం ఉన్నట్లు భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ​(సీఈఆర్​టీ-ఇన్​) పేర్కొంది.

ఇటీవలే ఇజ్రాయెల్​కు చెందిన స్పైవేర్ పెగాసస్ భారతీయుల వాట్సాప్​లలో చొరబడిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు చేసింది సీఈఆర్​టీ-ఇన్​. వాట్సాప్​లో ఉన్న లోపాలను ఉపయోగించుకొని సైబర్​ నేరగాళ్లు ప్రమాదకర వీడియో ఫైళ్లతో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని తెలిపింది. వినియోగదారుడి అనుమతి లేకుండానే ఈ ఫైళ్లు డౌన్​లోడ్​ అవుతాయని వెల్లడించింది. ఆండ్రాయిడ్​లో 2.19.274, ఐఓఎస్​లో 2.19.100కు ముందున్న వర్షన్​లలో సగానికిపైగా సాఫ్ట్​వేర్​లపై ఈ దాడి ప్రభావం కనిపించినట్లు పేర్కొంది.

ఎలా ఎదుర్కోవాలి

వాట్సాప్​ను తాజా వర్షన్​లోకి అప్​గ్రేడ్​ చేసుకుంటే ఇటువంటి దాడుల నుంచి తప్పించుకోవచ్చని సీఈఆర్​టీ-ఇన్​ సూచించింది.

ABOUT THE AUTHOR

...view details