Volkswagen New launch: జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ భారత మార్కెట్లో టైగూన్ యూవీ కార్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.31.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ కార్కు సంబంధించిన బుకింగ్స్ కూడా మంగళవారంతో ప్రారంభంకానున్నట్లు సంస్థ తెలిపింది. అయితే డెలివరీ మాత్రం జనవరి రెండో వారంలో ఉంటుందని పేర్కొంది.
ప్రీమియం లుక్‌తో ఈ వాహనం వినియోగదారులకు మంచి అనుభూతినిస్తుందని డెరెక్టర్ ఆషిష్ గుప్తా పేర్కొన్నారు. స్టైల్, పర్ఫార్మెన్స్, సేఫ్టీ విభాగాలు మరింతగా ఆకట్టుకుంటాయని తెలిపారు. మొత్తం ఈ ఏడాదిలో ఫోక్స్ వ్యాగన్ ఎస్‌యూవీల్లో నాలుగు కార్లను విడుదల చేసినట్లు గుర్తు చేశారు.
స్టాండర్డ్ వేరియంట్ ఫీచర్లు..
- 12.65 కి.మీ మైలేజీ
- 7 స్పీడ్ ట్రాన్సిమిషన్
- 1984సీసీ ఇంజన్
- ఐదుగురు కూర్చునేలా సీటింగ్
- యాంటి లాకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్