తెలంగాణ

telangana

By

Published : Jan 22, 2022, 8:00 AM IST

ETV Bharat / business

వొడాఫోన్‌ ఐడియాకు వేల కోట్ల నష్టం

VODAFONE IDEA RESULTS: మూడో త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఏకీకృత నష్టం రూ.7,230.9 కోట్లకు పెరిగింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.4,532.1 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కంపెనీ ఛార్జీలు పెంచడం ప్రతికూల ప్రభావం చూపినట్లు వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్​ చెప్పారు.

VODAFONE IDEA
వొడాఫోన్‌ ఐడియా

VODAFONE IDEA RESULTS: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఏకీకృత నష్టం రూ.7,230.9 కోట్లకు పెరిగింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.4,532.1 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో ఏకీకృత కార్యకలాపాల ఆదాయం రూ.10,894.1 కోట్ల నుంచి 10.8 శాతం తగ్గి రూ.9,717.3 కోట్లకు పరిమితమైంది. చందాదారుల సంఖ్య 26.98 కోట్ల నుంచి 24.72 కోట్లకు తగ్గింది.

కంపెనీ ఛార్జీలు పెంచడం ప్రతికూల ప్రభావం చూపింది. టారిఫ్‌ పెంపు చేపట్టినప్పటికీ.. వినియోగదారుడిపై సగటు ఆదాయం (ఆర్పు) రూ.121 నుంచి దాదాపు 5 శాతం తగ్గి రూ.115కు పడిపోయింది. డిసెంబరు త్రైమాసికానికి కంపెనీ స్థూల రుణభారం రూ.1,98,980 కోట్లుగా ఉంది.

'గత కొన్ని నెలల్లో చేపట్టిన టారిఫ్‌ పెంపు నిర్ణయాల వల్ల వరుసగా రెండో త్రైమాసికంలోనూ ఆదాయ వృద్ధి సాధించాం. మొత్తం చందాదారుల సంఖ్య తగ్గినప్పటికీ.. వీఐ గిగానెట్‌ సేవలతో 4జీ ఖాతాదారుల సంఖ్య బలంగానే ఉంది. మార్కెట్‌లో పోటీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మా వ్యూహాలను అమలు చేయడంపై దృష్టి పెడతాం' అని వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అదానీ గ్రూప్​ నుంచి మరో ఐపీఓ.. వచ్చేది ఎప్పుడంటే?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details