తెలంగాణ

telangana

ETV Bharat / business

నిధుల సమీకరణకు వొడాఫోన్‌ ఐడియా బోర్డు ఓకే

Vodafone idea Fundraise: భారీగా నిధుల సమీకరణకు వొడాఫోన్​ ఐడియా బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.14,500 కోట్లు సమకూర్చేందుకు బోర్డు ఆమోదించినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

Vodafone idea Fundraise
Vodafone idea Fundraise

By

Published : Mar 4, 2022, 5:57 AM IST

Vodafone idea Fundraise: భారీగా నిధులను సమీకరించాలన్న ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా ప్రణాళిక విషయంలో ముందడుగు పడింది. మొత్తం రూ.14,500 కోట్లు సమీకరించేందుకు వొడాఫోన్‌ ఐడియా బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ గురువారం తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇందులో రూ.4,500 కోట్లను ప్రమోటర్‌ సంస్థలనుంచి సేకరించనున్నారు.

ఒక్కో షేరును రూ.13.30 ఇష్యూ ప్రైస్‌ వద్ద 10 రూపాయల ముఖ విలువ కలిగిన 338.3 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ సంస్థలకు విక్రయించనున్నారు. యూరో సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, ప్రైమ్‌ మెటల్‌ లిమిటెడ్‌ (వొడాఫోన్‌ గ్రూప్‌కు చెందిన సంస్థలు), ఒరియానా ఇన్వెస్ట్‌మెంట్‌ పీటీఈ లిమిటెడ్‌ (ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ)కు ప్రిఫరెన్షియల్‌ బేసిస్‌పై ఈ షేర్లు కేటాయించనున్నట్లు వొడాఫోన్‌ ఐడియా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీని ద్వారా రూ.4,500 కోట్లు సేకరించనున్నారు.

ఇక ఈక్విటీ షేర్ల విక్రయం లేదా గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (జీడీఆర్​), అమెరికన్‌ డిపాజిటరీ (ఏడీఆర్​), ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్‌ (ఎఫ్​సీసీబీ) వంటి రుణ సాధనాల ద్వారా రూ.10వేల కోట్లు నిధులు సమీకరించనున్నట్లు వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. దీంతో పాటు మార్చి 26న బోర్డు అసాధారణ సమావేశం (ఈజీఎం) ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపిందని ఆ కంపెనీ తెలిపింది.

ఇదీ చూడండి:టాటా మోటార్స్‌ వినూత్న కార్యక్రమం​.. ఇక ఊళ్లలోకి షోరూమ్‌లు

ABOUT THE AUTHOR

...view details