తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్ బ్యాంకులో రూ.265 కోట్లు విత్​డ్రా.. ఎలా సాధ్యం? - ఎస్​ పూరీ జగన్నాథ ఆలయం

ఎస్​ బ్యాంకు సంక్షోభాన్ని ముందే పసిగట్టిన వడోదరా నగరపాలక సంస్థ అధికారులు చురుకుగా వ్యవహరించారు. అందులో జమ చేసిన స్మార్ట్​ సిటీ నిధులు రూ.265 కోట్లను ముందుగానే ఉపసంహరించుకున్నారు.

vmc
ఎస్ బ్యాంకు

By

Published : Mar 7, 2020, 2:29 PM IST

Updated : Mar 7, 2020, 2:39 PM IST

ఎస్​ బ్యాంక్ సంక్షోభం వేళ గుజరాత్​ వడోదరా నగరపాలక (వీఎంసీ) అధికారులు చురుకుగా వ్యవహరించారు. వీఎంసీ అధీనంలోని వడోదరా స్మార్ట్​ సిటీ అభివృద్ధి సంస్థకు చెందిన రూ.265 కోట్లు ఎస్​ బ్యాంకు నుంచి రెండురోజుల క్రితమే విత్​డ్రా చేశారు.

ఈ మొత్తం స్మార్ట్ సిటీ మిషన్​ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు వీఎంసీ డిప్యూటీ కమిషనర్​ సుధీర్ పటేల్ తెలిపారు. ఎస్ బ్యాంకు సమస్యల్లో ఉన్న కారణంగానే ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. ఆ డబ్బును బ్యాంక్ ఆఫ్ బరోడాలో వేశామన్నారు.

బ్యాంకులోనే జగన్నాథుడి సొమ్ము

ఎస్‌ బ్యాంకులో దేవుడి పేరిట రూ.545 కోట్లను జమ చేసింది పూరీ జగన్నాథ్‌ దేవాలయం. ఈ ధనానికి సంబంధించి భక్తులు, పూజారులు ఆందోళన చెందుతున్నారు.

ఎస్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించడం.. నగదు ఉపసంహరణ పరిమితిని రూ.50,000 నిర్ణయించింది. ఫలితంగా కొంత ఆందోళన నెలకొందని ఆలయాధికారి బైనాయక్‌ దాస్మోహావ్‌ పాత్రా పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఎస్​ బ్యాంక్ సంక్షోభంపై ఎవరెవరు ఏమన్నారంటే..

Last Updated : Mar 7, 2020, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details