చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్, వివో తన కొత్త 'ఎస్' సిరీస్ స్మార్ట్ఫోన్ 'వివో ఎస్1'ను ఆగష్టు 7న భారత్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ విపణిలో ఇప్పటికే ఈ మోడల్ విడుదలైంది. అవే స్పెసిఫికేషన్లతో భారతీయులకు అందుబాటులోకి రానుంది.
భారత్లో వివో ఎస్1 ధరలు...
ఇండియాషాప్స్.కామ్ వెబ్సైట్ ప్రకారం... వివో ఎస్ సిరీస్ ఫోన్ మూడు వేరియంట్లతో భారత్ మార్కెట్లోకి వస్తోంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజి సామర్థ్యంగల 'వివో ఎస్1' బేస్ మోడల్ ధర రూ.17,990 ఉంటుందని ఇండియాషాప్స్ పేర్కొంది.
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్గల రెండో మోడల్ వివో ఎస్1 ధర రూ.19,990లుగా ఉండబోతోంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంగల మూడో మోడల్ ధర రూ.24, 990.
వివో ఎస్1 ప్రత్యేకతలు
వివో ఎస్1 ఇంటర్నేషన్ వేరియంట్లో (4 జీబీ, 6జీబీ, 8జీబీ)
ప్రాసెసర్ : ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పి65 ప్రాసెసర్
స్టోరేజ్ : 128 జీబీ వరకు